
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు ప్రభులుతున్నాయని.. దీనిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేకపోతే అధికారం
నుంచి తప్పుకోవాలని సినీనటుడు కమల్ హాసన్ అన్నారు. గత కొంతకాలంగా తమిళనాడులో డెంగ్యూ జ్వరాలు ప్రభులుతున్నాయి.
దీనిపై కమల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకప్పుడు ఈ డెంగ్యూ జ్వరం కారణంగా తన కుమార్తె చావు అంచుల దాకా వెళ్లిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలోనూ కమల్ ..ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే.