మహేష్ తన వాగుడు తగ్గిస్తే మంచిదంటున్న కాజల్..!

Published : Aug 17, 2017, 12:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మహేష్ తన వాగుడు తగ్గిస్తే మంచిదంటున్న కాజల్..!

సారాంశం

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లపై కాజల్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

 

కాజల్ కి ఏమైంది.. ఎందుకలా మాట్లాడుతోంది అంటూ ప్రస్తుతం సినీ వర్గాలన్నీ చర్చించుకుంటున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారులుగా వెలుగొందుతున్న ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లపై కాజల్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

తేజ దర్శకత్వంలో రానా సరసన కాజల్ నటించిన ‘ నేనే రాజు .. నేనే మంత్రి ’  చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా ఇటీవల ఓ టీవీషో కి కాజల్ అతిథిగా హాజరయ్యారు. ఇందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు కాజల్ చెప్పిన సమాధానాలు చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ తన హైపర్ యాక్టివ్ నెస్ ని తగ్గించుకోవాలని, ప్రభాస్ మరికొంచెం ఎనర్జీతో నటిస్తే బాగుంటుందని, మహేష్.. చాటర్ బాక్స్ లో ఎప్పడూ లొడా లొడా మాట్లాడటం తగ్గించుకోవాలని..  పవన్ కల్యాణ్  అందరితో స్నేహ పూర్వకంగా ఉండాలని కాజల్ యాంకర్ తో తెలిపారు.

ఆమె ఏ ఉద్దేశంలో ఇలా మాట్లాడారో తెలియదు కానీ.. ఆమె వ్యాఖ్యలపై ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజల్.. ఎన్టీఆర్ తో బృందావనం, బాద్ షా, ప్రభాస్ తో డార్లింగ్, మిష్టర్ పర్ ఫెక్ట్, మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం, పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలలో నటించారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu