యుక్రెయిన్ లో కడప జిల్లా విద్యార్థి మృతి

First Published Sep 20, 2017, 11:27 AM IST
Highlights

స్నేహితుడిని రక్షించబోయి సముద్రంలో కొట్టుకుపోయిన అశోక్

యుక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బీచ్ లో వాలీబాల్ అడుతున్న సమయంలో ప్రమాదావశాత్తు అలతాకిడికి కోట్టుకుపోయినట్లు సమాచారం అందింది.  ఇందులో ఒకరు  హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి కాగా మరొకరు  కడపకి చెందిన అశోక్‌ కుమార్‌ మారుగుత్తి(ఫోటో). అశో క్ కడప జిల్లా కోడూరు పట్టణానికి చెందిన వాడు. నెల్లూరు నారాయణ కాలేజీలో బైపిసి చదివాడు.  వీరు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో  ఉన్నారు.  ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం బీచ్ లో వాలీబాల్ అడుతున్న సమయంలో బాల్ వెళ్లి సముద్రంలో పడింది.  బాల్ తీసుకురావడానికి మొదట  ముఖేష్ వెళ్లాడు. అయితే, అతను  అలలతాకిడికి సముద్రంలోకి కోట్టుకుపోయాడు. ఇది గమనించిన శివకాంత్ రెడ్డి, అశోక్‌ కుమార్‌ అతడిని కాపాడేందుకు సముద్రంలోకి దూకారు. అయితే అలలు వారిని కూడా లాక్కుని పోయాయి. వారు అలల దాటికి ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. తోటి స్నేహితులు వెంటనే విషయాన్ని యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే అక్కడి పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. సముద్రంలో పడిపోయిన యువకుల కోసం గాలింపులు ముమ్మరం చేశారు.

click me!