విమానంలో పుట్టిన బుడ్డోడికి జెట్ ఎయిర్ వేస్ అరుదైన కాన్క

Published : Jun 19, 2017, 01:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
విమానంలో పుట్టిన బుడ్డోడికి జెట్ ఎయిర్ వేస్ అరుదైన కాన్క

సారాంశం

సౌదీ అరేబియా లోని దమ్మంనుంచి కేరళ లోని కొచ్చికి వస్తున్న తమ విమానంలో పుట్టిన ఓ బాలునికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఒక అరుదయిన కాన్క అందించింది

సౌదీ అరేబియా లోని దమ్మంనుంచి కేరళ లోని కొచ్చికి వస్తున్న  తమ విమానంలో పుట్టిన ఓ బాలునికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ జీవిత కాల ఉచిత ప్రయాణ పాస్ అందించింది.

‘‘ మా విమానంలో ఒక శిశువు జన్మించడం ఇదే కావడంతో, జెయిట్ఎయిర్ వేస్ విమానాలలో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేసే పాస్ అందిస్తున్నాం,’’ జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.

నిన్న విమానం ఇంకా అరేబియా సముద్రం మీద ఎగురుతుండగనే శిశువు తల్లికి పురిటినొప్పులు మొదలయ్యాయి.

ఫలితంగా ఫ్లయిట్ 9డబ్ల్యు 569ను అత్యవసరంగా ప్రసవం కోసం ముంబాయికి  మళ్లించాల్సి వచ్చింది. తల్లిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పురుడుపోశారు. మగశిశువు జన్మించాడు. విమానంలో నే ప్రయాణిస్తున్న కేరళ నర్సు ప్రసవానికి సహకరించింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu