
దేశమంతా త్రిభాష సూత్రంతో ముందుకు వెళితే.. తమిళనాడు మాత్రం హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ద్విభాషా సూత్రంతో ( తమిళం, ఇంగ్లిష్) వెళ్లింది. హిందీని అధికార భాషగా కేంద్రం నిర్ణయించినప్పటి నుంచి తమిళనాడే హిందీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది.
తమిళనాట ఎక్కడైనా హిందీ పేరుతో బోర్డులు కనిపిస్తే వాటిపై నల్లటి రంగు పూసి నిరశన తెలిపేవారు. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కూడా ఇటీవల వరకు హిందీపైనే కాకుండా తమిళనాట తెలుగు భాష కొనసాగింపుపై కూడా ఆంక్షలు విధించారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం హిందీలో తమిళనాడుకు లేఖలు పంపితే దానికి తమిళంలో రిప్లై ఇచ్చి జయ తమ నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
ఇదంతా చూస్తే అమ్మ.. హిందీకి వ్యతిరేకం అనే అనుకుంటారు. కానీ, జయలలిత కు బాగా నచ్చిన పాట మాత్రం... హిందీ సినిమాలోనిదే.
ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్య్వూలో చెప్పారు. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో 1956 లో విడుదలైన రాజ్ కపూర్, నర్గీస్ ల సూపర్ హిట్ హిందీ సినిమా.. చోరీ చోరీ లోని
‘ఆజా సనమ్ మధుర్ చాందిని మెన్ హమ్ తుమ్ మిలే’... అనే పాటను స్వయంగా అమ్మ పాడి వినింపించారు.
2012లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూలో జయ పాడిన పాట ఈ వీడియోలో చూడొచ్చు.