
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ రంగంలోకి దూకుతున్నట్లు ప్రకటించింది.
ఎఐఎడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్ 100 జయంతి సందర్భంగా మెరీనా బీచ్ స్మారక మందిరం వద్ద నివాళులు అర్పించాక అమె ఈ విషయం ప్రకటించారు. అయితే, ఎపుడు రాజకీయాలలోకి ప్రవేశించేది, పార్టీ ఏమిటి, కార్యక్రమం ఏమిటనేది వెల్లడించ లేదు.
అయితే, జయలలిత జన్మదినం ఫిబ్రవరి 24న కీలకమయిన రాజకీయ ప్రకటన చేస్తానని మాత్రం చెప్పారు.
అయితే, ఎఐఎడిఎంకె కు రామచంద్రన్, జయలలిత నాయకత్వం తప్ప మరొక రి నాయకత్వం అంగీకరించేది లేదని ఆమె స్పష్టంగా ప్రకటించారు.
“ ప్రజల విజ్ఞప్తిని గౌరవించాలని నిర్ణయించాను. తమిళనాడును ఆసియా ఉత్తమ రాష్ట్రం చేసేందుకు మనమంత ఐక్యంతా పనిచేద్దాం,” అని కూడా అమె పిలుపునిచ్చారు.
ఈ మధ్య దీపాజయకుమార్ తమిళనాడు ఒక అసక్తికరమయిన రాజకీయ శక్తిగా కనిపిస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చి ఎఐఎడిఎంకెని నడిపించాలని పార్టీలోని అసమ్మతి వర్గం ఆమెను ప్రోత్సహిస్తూ ఉంది. అమె ఇంటికి వచ్చే సందర్శకుల సంఖ్యకూడాపెరుగుతూ ఉంది. అమె పేరుతో పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి.
అమె రాజకీయ ప్రవేశంతో తమిళనాడు వేడెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెతో జాతీయ పార్టీలేవయిన సంప్రదింపులు జరుపుతున్న వార్తలు ఇంకా వెలువడటం లేదు. రాష్ట్రంలో ఉనికిలేని జాతీయ పార్టీలు ప్రతిఅవకాశాన్ని వినియోగించుకుని అక్కడ కాలూనాలని చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకుంటాయి. దీప రాజకీయ ప్రకటన కొన్ని జాతీయ పార్టీలకు మళ్లీ నోరూరించవచ్చు.
అయితే, ఈ వ్యవహారం వెనక ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతి ఎస్ గురుమూర్తి ఉన్నారని అన్నా డి.ఎమ్.కె. ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ అనుమానిస్తున్నారు.
పార్టీని చీల్చి , రాజకీయంగా లబ్ది పొందేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని నటరాజన్ ఆరోపించారు.