రాజకీయపార్టీ పెట్టిన జల్లికట్టు యువత

First Published Feb 26, 2017, 2:11 PM IST
Highlights

ఎన దేశం ఎన ఉరుమై (నా దేశం నా హక్కు) పేరుతో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న యువతే ఈ  రాజకీయ పార్టీ ఏర్పాటుకు చొరవచూపింది.

 

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం నిషధం విధించినా, పెటా అలాంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తడి తెచ్చిన తమ సంప్రదాయ క్రీడ కోసం తీవ్ర ఉద్యమం చేసిన తమిళ యువత ఇప్పుడు మరో పోరుకు సిద్ధమైంది.

 

జల్లకట్టుపై తంబీలు చూపిన తెగువ గురించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన పనిలేదు. ఎవరి మార్గదర్శకం లేకుండానే అక్కడి యువత ఉప్పెనలా కదిలి వచ్చి జల్లికట్టు నిషేధంపై పోరాడింది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా చేసింది.

 

ఇప్పుడు అదే ఉద్యమస్ఫూర్తితో అక్కడి యువత రాజకీయ రంగ ప్రవేశం కోసం సిద్ధమైంది.

త‌మిళ రాజ‌కీయాలు సంక్షోభంలోకి కూరుకుపోయిన నేప‌థ్యంలో కొత్తగా పార్టీ నెలకొల్పింది. ఎన దేశం ఎన ఉరుమై (నా దేశం నా హక్కు) పేరుతో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న యువతే ఈ  రాజకీయ పార్టీ ఏర్పాటుకు చొరవచూపింది.

 

దివంగత రాష్ట్రతి అబ్దుల్ క‌లాం స్ఫూర్తితో  కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న ఆయన ఆశయాలకు అనుగుణంగా కుల, మతాలకు తావులేకుండా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని పార్టీ వ్యవస్థాపకులు ప్రకటించారు. అవినీతి రహిత సమాజంమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.

 

జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రటకించారు.

 

కాగా, వీరి పార్టీ జెండా జాతీయ జెండాను పోలి ఉంది. మధ్యలో సంకెళ్లు  తెంచుకుంటున్న యువకుడి చిత్రాన్ని ముద్రించారు.

click me!