ఈ - వరాలు ఇచ్చారు..

First Published Dec 8, 2016, 3:35 PM IST
Highlights

క్యాష లెస్ లావాదేవీలపై కేంద్రం భారీ ఆఫర్లు

పెద్ద నోట్లు రద్దైన తర్వాత కేంద్ర క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. నోట్లు రద్దు ప్రకటన చేసిన నెల రోజుల తర్వాత దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా అనేక రాయితీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

 

రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత 20% నుంచి 40% వరకు నగదు రహిత లావాదేవీలు పెరిగాయని మరింత ప్రోత్సహించేందుకు 11 సూత్రాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. డిజిటల్‌ చెల్లింపుల ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా డీజిల్‌, పెట్రోలు కొనుగోలు చేసేవారికి 0.75% రాయితీ, డిజిటల్‌ విధానంలో సబర్బన్‌ రైల్వే నెలవారీ పాసులు తీసుకొనే వారికి జనవరి 1, 2017 నుంచి 0.5 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించారు.


ఆన్‌లైన్‌ విధానంలో రైల్వే టిక్కెట్లు కొనేవారికి రూ.10,00,000 విలువైన బీమా వర్తిస్తుంది, రైల్వేలో భోజనం, వసతి గదులు బుక్‌ చేసుకొనేవారికి 5% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.



వెబ్‌సైట్ల ద్వారా ప్రభుత్వ సంస్థల్లో సాధారణ, జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసేవారికి ప్రీమియంలో 8-10% రాయితీ ఉంటుందన్నారు.

 

అలాగే, పీవోఎస్‌ యంత్రాలు, మైక్రో ఏటీఎమ్‌లు, మొబైల్‌ పీవోఎస్‌లు వినియోగించే వారి వద్ద నెలవారీ రుసుము రూ.100 తీసుకోరాదని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలిపారు.

click me!