పాత నోట్లుంచుకుంటే జైలుకే

First Published Dec 28, 2016, 7:13 AM IST
Highlights

మార్చి 31 తర్వా పాత పెద్ద నోట్లుంటే జైలుకే

 

వచ్చే మార్చి నెల తరువాత ఎవరైనా పాత నోట్లు కలిగి ఉంటే వారికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 

 

దీనికి సంబందించి ఆర్డినెన్స్ కు  క్యాబినెట్  ఆమోదం తెలిపింది.నోట్ల రద్దు తర్వాత వ్యవస్థను భ్రష్టు పట్టించాక ఇపుడు నోట్లను ఉంచుకున్నారనో,మార్చాలనుకుంటున్నారనో తాట వొలిచేందుకు కేంద్రం సిద్దమవుతూ ఉంది. నోట్లరద్దును కట్టుదిట్టంగా అమలుచేయలేకపోయినా, ఈ శిక్షలను మాత్రం పకడ్బందీగా అమలుచేసేందుకు చర్యలు మొదలుపెట్టింది.

 

అయిదొందల, వేయి నోట్ల రద్దుకు చట్ట భద్రత కల్పించేందుకు కేంద్రం ఈ ఆర్ధినెన్స్ను తీసుకురావాలనుకుంటున్నది.

 

మొదట డిసెంబర్ 31 తర్వాత పదివేల కంటే ఎక్కవ విలువయిన పాతనోట్లను మార్చేందుకు  ప్రయత్నిస్తే రు. 5 వేల జరిమానతో శిక్షల పర్వం మొదలవుతుంది.మార్చి 31 వ తర్వాత పాతనోట్లు దగ్గిర ఉంచుకున్నా నాలుగేళ్లు జైలు శిక్ష ఉంటుంది.

 

పాతనోట్ల మీద మోజు ఉంటే మహా అంటే ఒక పదినోట్లను దగ్గిరుంచుకోవచ్చు. ఇంతకంటె ఎక్కు వుంటే మాత్రం నేరమవుతుంది.

 

 

click me!