సినారే కు జగన్ నివాళి

Published : Jun 12, 2017, 01:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సినారే కు జగన్ నివాళి

సారాంశం

ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం మరణించిన మహాకవి సినారే కు నివాళులర్పించారు.

ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, ఈ ఉదయం మరణించిన మహాకవి సినారేకు నివాళులర్పించారు.

సినారె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆయనతో పాటి  సీనియర్ పార్టీనేతలు భూమన కరుణాకర్ రెడ్డి, బోత్స, అంబటి  తదితరులు కూడా నివాళులర్పించారు.

 

మహాకవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తర్వాత జగన్‌ అన్నారు.

"తెలుగు సాహిత్యరంగంలో  ఆయన ఒక ధ్రువతార నేలరాలిందని, సినారె మరణం తెలుగుజాతికి తీరనిలోటు," అని  ఆయన వ్యాఖ్యానించారు.

‘రైతు కుటుంబంలో పుట్టిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారు. కవిగా, మృదుభాషిగా, మానవతావాదిగా, సినీ గేయరచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా.. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివి,’ అని  జగన్‌ కొనియాడారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !