అసెంబ్లీకి ఇక గుడ్ బై... జనం మధ్యకు మళ్లీ జగన్

First Published Mar 25, 2017, 2:26 AM IST
Highlights

మాటాడనీయని సభని బహిష్కరించి జనం మధ్యకు వెళ్లి అసెంబ్లీలో జరగుతున్నదేమిటో ,సిఎం చేస్తున్నదేమిటో చెప్పేందుకు ఊరూరి యాత్ర....

మాటాడనీయని అసెంబ్లీకొచ్చి రోజూ గొడవపడటం కంటే, అసెంబ్లీనే బాయ్ కాట్ చేసి  ప్రజల్లోలకి వెళితే ఎలా ఉంటుందనే ప్రశ్న వైసిపి నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో  మొదలయిందని సమాచారం.

 

ఇక అసెంబ్లీలో ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణ చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం  స్పీకర్ పదవిని వుపయోగించుకుంటున్నదని అందువల్ల ఇక అసెంబ్లీలో ఏలినవారి ‘దురాగతా’ లను ప్రస్తావించడం కూడా కుదరదనే అభిప్రాయనికి వైసిపి నేత వచ్చాడని  పార్టీ ఎమ్మెల్యే ఒకరు ‘ఏసియా నెట్’ కు చెప్పారు.

 

ఇది ఆయన చివవరిసమావేశమం కావచ్చని అన్నారు.

 

‘సభలో ఎవరు మాట్లాడినా సభాపతినే ఉద్దేశించాలి. అధికార, ప్రతిపక్షాలు రెండు నేరుగా తలపడుతున్నపుడు స్పీకర్ జోక్యం చేసుకుని ఛెయిర్ వైపు చూసి మాట్లాడండని వారించాలి.  అయితే, ఇక్కడ స్పీకర్ ఏమిచేస్తున్నారు? అధికార పక్షం వాళ్లు వేసే ప్రశ్నలకు ‘ ముందు మీరు వారికి సమాధానం చెప్పండి,’ అని ప్రతిపక్ష నాయకుడికి సలహా ఇవ్వడం జరుగుతున్నది  ‘ నాదేమీ లేదు, మంత్రి అడుడుతున్నారు, సమాధానం చెప్పండి,‘ అనే ధోరణి స్పీకర్  ప్రదర్శిస్తున్నారు. ఇక అసెంబ్లీ కొచ్చి ఏం లాభం,’ అని జగన్ మదిలో ఆలోచన మొదలయిందని ఆయన చెప్పారు.

 

ఏ విమర్శచేసినా,  దర్యాప్తులో మీ ఆరోపణలు తప్పని తెలితే హౌస్ నుంచి వెలివేస్తామనే  ఎదురు దాడి భారత దేశ పార్లమెంటరీ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదని  ఆయన అన్నారు.

 

తన దగ్గిర, ‘ఉన్న అధారాలతో ప్రతిపక్షం  మంత్రులు లేదా ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం  మీద విచారణకు  డిమాండ్ చేస్తుంది, దానికి సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. అలాకాకుండా అది తప్పని తేలితే రాజీనామా చేస్తారా అని ప్రతిసవాల్ విసరడం, అప్రజాస్వామికమే కాదు, నియంతృత్వ పోకడం,‘ అని ఆయన అన్నారు.

 

 

అందువల్ల ఈ అసెంబ్లీ దండగ అని ప్రజల్లోకి పోవాలనే అలోచన మొదలయిందని ఆయన చెప్పారు.

 

 

బడ్జెట్ సమావేశాలు ఎలాగూ మొదలయ్యాయి కాబట్టి, వీటితో ఇలా గే పెనుగులాడి, వచ్చే సమావేశం నుంచి ఇక అసెంబ్లీకి రావడమే మానేస్తే ఎ లా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నట్లు ఈ శాసన సభ్యుడు చెప్పారు.

 

 

ఇపుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలా నడుస్తున్నది, తన ఉపన్యాసాలను అడ్డుకునేందుకు స్పీకర్ పది పది  హేను మందికి మాట్లాడేందుకు ఎలా అనుమతిస్తున్నారు, అపుడంతా తాను నోరు మూసుకుంటున్నానని జగన్ ప్రజలకు వివరిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా మాట్లాడేందుకు రెండు నిమిషాలు గడువీయండని బతిమాలే పరిస్థితి రావడంతో జగన్ సభ మీద పూర్తి గా విశ్వాసంకోల్పోయారని ఆయన అన్నారు.

 

 

తాను లెవనెత్తుతున్న విషయాలను వినడానికి బదులు,వాళ్ల  అసందర్భోపన్యాసాలు,  దూషణలు  వినేలా చేస్తూ తాను ఏ విషయం సభలో ప్రస్తావించకుండా చేస్తున్నారని  జగన్ ఈ యాత్రలో జనాలకు చెప్పాలనుకుంటున్నారని ఆయన తెలిపారు.

 

 

తాను విచారణ  కోరుతున్న  అంశాలన్నింటిని ప్రజల ముందు పెడుతూ ఆయన  మిగిలిన రెండు సంవత్సరాలు తిరగుతాడని ఆయన చెప్పారు.

 

 

బడ్జెట్ సమాశాల తర్వాత, పార్టీలో ఈ ప్రతిపాదన మీద ఒక సారి చర్చ జరిపి, శాసన సభ్యుల, ఎంపిల అభిప్రాయాలను కూడా తీసుకుని, తుది నిర్ణయం తీసుకోవచ్చని ఆయన చెప్పారు.

 

 వర్షాకాల సమావేశాల రోజునుంచి సభను ఆయన బహిష్కరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బహుశా వర్షాకాల సమావేశాల తొలిరోజున ఆయన సభలో నిరసన ప్రకటన చేసి వాకౌట్ చేసే అవకాశం ఉందని ఆయనవెల్లడించారు.

 

అందువల్ల  ఈ బడ్జెట్ సమావేశాలే జగన్ కు చివరి సమావేశం అయ్యేందుకు చాలా అస్కారముంది.

 

 

 

 

 

 

 

click me!