అవి అచ్చమైన తెలుగు ‘పలుకు’లు

Published : Mar 24, 2017, 10:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అవి అచ్చమైన తెలుగు ‘పలుకు’లు

సారాంశం

తెలుగోడి మౌత్ ఫ్రెషనర్ గా క్రేన్ వెలిగిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

స్వచ్ఛమైన తెలుగు పలుకులు లాంటివి క్రేన్ వారి వక్కపొడి పలుకులు. శుభకార్యం నుంచి తాంబూలం వరకు తెలుగువారి ప్రతి కార్యక్రమంలో వాటికే పెద్దపీఠ.

 

దశబ్దాల తరబడి తెలుగోడి మౌత్ ఫ్రెషనర్ గా క్రేన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ గా వెలిగిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

ఉత్తర భారత్ అంతా పాన్ మసాలాకు అలవాటు పడితే దక్షణంలో మాత్రం ప్రజలంతా వక్కపొడికి జై కొట్టారు.

 

ఈ అంశాన్ని గుర్తించే వక్కపొడి వ్యాపారంలోకి అడుగుపెట్టారు తెలుగువాడైన గ్రంథి సుబ్బారావు.

 

‘వివాహాది శుభకార్యాలకు క్రేన్‌ వక్క పలుకులు’ అనే నినాదంతో తెలుగునాట సుపరిచితమై దాదాపు రూ. 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.

 

తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశమంతా తన వక్కపొడి రుచిని చవిచూపించారు.

 

ఆయన కేవలం వ్యాపారవేత్తగానే కాదు ఆధ్యాత్మిక రంగ ప్రముఖుడుగాను విశేష సేవలు అందించారు. కానీ, ఈ వేళ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

 

అయితే క్రేన్ పేరుతో ఆయన సృష్టించిన సామ్రాజం, వక్కపొడి అమ్మకాలతోనే సృష్టించిన ఉపాధి నేటి పారిశ్రామికవేత్తలు ఓ గొప్పపాఠాన్ని మాత్రం చెబుతాయి.

 

విలువలు, నాణ్యతకు పెద్దపీఠ వేస్తే ఏ రంగంలో ఉన్న అత్యున్నత శిఖరాలకు చేరవచ్చని ఆయన క్రేన్ వక్కపొడితో నిరూపించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !