రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

First Published Oct 4, 2017, 3:48 PM IST
Highlights
  • రసాయన శాస్త్రంలో  ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది
  • ఇప్పటివరకు రసాయనశాస్త్రంలో నలుగురు మహిళలు నోబెల్ బహుమతి అందుకున్నారు
  •  1901 నుంచి 2017వరకు రసాయన శాస్త్రంలో 109 నోబెల్ బహుమతులు అందజేశారు.

రసాయన శాస్త్రంలో  ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. జాక్వెస్ డుబోచెట్, జ్వాచిమ్ ఫ్రాంక్, రిచార్డ్ హెండర్సన్ లకు నోబెల్ బహుమతి లభించింది. బయోమాలిక్యులస్ అధిక రిజల్యూషన్ నిర్మాణానికి కావాలసిన క్రయో- ఎలక్ట్రాన్  మైక్రోస్కోపీ విధానాన్ని కనిపెట్టినందుకు గాను ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలకు ఈ యేడాది రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని బుధవారం ప్రకటించారు. 

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

1. 1901 నుంచి 2017వరకు రసాయన శాస్త్రంలో 109 నోబెల్ బహుమతులు అందజేశారు.

2. వ్యక్తిగతంగా 63మందికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందజేశారు.

3.ఇప్పటివరకు రసాయనశాస్త్రంలో నలుగురు మహిళలు నోబెల్ బహుమతి అందుకున్నారు.

4.ఫ్రెడెరిక్ సాంగర్ అనే వ్యక్తి రసాయన శాస్త్రంలో 1958, 1980 సంవత్సరాలలో రెండు సార్లు నోబెల్ బహుమతి అందుకున్నారు.

5.రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అతి తక్కువ వయసు 35, ఎక్కువ వయసు 85.

6. ఫ్రెడెరిక్ జాలిట్ అనే వ్యక్తి 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకోగా అప్పుడు ఆయన వయ సు 35 సంవత్సరాలు.

7. జాన్ బి ఫెన్ అనే వ్యక్తి 2002లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. అప్పుడు ఆయన వయసు 85 సంవత్సరాలు.
 

 

click me!