బ్రాహ్మణ కార్పొరేషన్ ఛెయిర్మన్ ఐవైఆర్ బర్తరఫ్

Published : Jun 20, 2017, 01:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛెయిర్మన్ ఐవైఆర్ బర్తరఫ్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృ ష్ణారావును పదవి నుంచి తొలగించారు. ఫేస్ బుక్ లో ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న విషయం రచ్చ రచ్చయింది. చివరకు దాని మీద తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నరెచ్చిపోయి మాట్లాడారు. ఐవైఆర్ పేస్ బుక్ వార్త రావడం, ముఖ్యమంత్రి  ఆగ్రహించడం, టిడిపినేతలు రెచ్చిపోవడం, ప్రభుత్వం ఆయన్ను తొలగించాలనుకోవడం...అంతా గంటల్లో జరిగింది. దీనితో ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృ ష్ణారావు పదవి పోయింది.

ఫేస్ బుక్ లో ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న విషయం రచ్చ రచ్చయింది. చివరకు దాని మీద తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (పై ఫోటో) రెచ్చిపోయి మాట్లాడారు. ఇది ఆయన పదవికి ఎసరుగా  భావించారు. ఆయన తొలిగిస్తూ జొవొ విడుదల చేశారు.

గుంటూరుకు చెందిన ఆనంద్ సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కొద్ది సేపట్లో  ప్రభుత్వం నియమించనుంది. 

ప్రధాన   కార్యదర్శిగా రిటైరయిన తర్వాత కృష్ణారావును చంద్రబాబునాయుడు బ్రాహ్మణకమిషన్ ఛెయిర్మన్ నియమించారు.

అయితే, ఈ విశ్వాసం కూడా లేకుండా  ఆయన తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని వెంకన్న విమర్శించారు.

ఆయన అన్నమాటలు...

ఐవైఆర్  కృష్ణారావు నీచమైన చర్యకి పాల్పడ్డారు.

ఆయన ఈ విధంగా మాట్లాడటం సరైనది కాదు.

సీఎం ఆయనకి ఎన్నో పదవులు కల్పిస్తే తిన్నింటి వాసాలు లెక్కించాడు.

ఇతర పార్టీలో చేరాలని ఆశతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

 

ఐవైఆర్ పేస్ బుక్ వార్త రావడం, ముఖ్యమంత్రి  ఆగ్రహించడం, టిడిపినేతలు రెచ్చిపోవడం, ప్రభుత్వం ఆయన్ను తొలగించాలనుకోవడం..జివొ విడుదల చేయడం .అంతా గంటల్లో జరిగిపోయింది.

దీనితో ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !