హైదరాబాద్ లో ఇవాంక ప్రోగ్రామ్ ఇదే

First Published Nov 24, 2017, 3:22 PM IST
Highlights

నవంబర్ 29 రాత్రి శంషాబాద్ నుంచి ఇవాంక అమెరికా తిరుగు ప్రయాణం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ విడుదలయింది.

గ్లోబల్ యాంటర్ ప్రన్యూర్ సమిట్ కు ఆమె హాజరవుతున్న సంగతి తెలిసిందే.

*నవంబర్  28న ఉదయం 3.30కి ఆమె శంషాబాద్‌కు చేరుకుంటారు.  ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్‌లో 100 మంది ప్రతినిధులు ఆమె వెంట హైదరాబాద్ వస్తున్నారు.

*మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌లో ఆమె బస చేస్తారు.

*ఉదయం 9.30కి హెచ్‌ఐసిసిలో ప్రతినిధులతో ఇవాంక మొదటి సమావేశం జరుగుతుంది.

*మధ్యాహ్నం తర్వాత 4.30కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్‌లో ఆమె పాల్గొంటారు.

 *సాయంత్రం 6.30కి ప్రధాని మోడీతో కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు.

*ఫలక్ నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఆమె గౌరవార్థం ప్రధాని ఇచ్చే విందులో పాల్గొంటారు.

 *తరువాత రాత్రి. 9.00కి వెస్టిన్ హోటల్‌లో బస.

*నవంబర్  29వ తేదీ ఉదయం 9.30కి హెచ్‌ఐసిసి గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొంటారు.

*ఆ తర్వాత తెలంగాణ మంత్రులతో ఇవాంక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇది ఇంకా ఖరారు కాలేదు.

*మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో ఇవాంక పాల్గొంటారు.

*సాయంత్రం 6గంటలకు హోటల్‌కు తిరుగు ప్రయాణం.

 *రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్‌లో ఇవాంక తిరిగి అమెరికాకు వెళ్తారు.

 

 

 

click me!