రామ్ నాథ్ కోవింద్ మీద పోటీకి మీరా కుమార్ ఎంపిక

First Published Jun 22, 2017, 7:21 PM IST
Highlights

రాష్ట్రపతిఎన్నికలకు పోటీ అనివార్యమయింది. ఎన్డీ ఎ అభ్యర్థి  రామ్ నాథ్ కోవింద్ మీద పోటీ పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు తీర్మానించడంతో  ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలన్న బిజెపి ప్రయత్నం సఫలం కాకుండా పోతున్నది. ప్రతిపక్షాలు ఉమ్మడి  అభ్యర్థిగా  లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్ ని నిలబెట్టాలని 17 పార్టీల నేతలు నిర్ణయించారు.

రాష్ట్రపతిఎన్నికలకు పోటీ అనివార్యమయింది. ఎన్డి ఎ అభ్యర్థి  రామ్ నాథ్ కోవింద్ మీద పోటీ పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు తీర్మానించడంతో  ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలన్న బిజెపి ప్రయత్నం సఫలం కాకుండా పోతున్నది. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా  లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్ నిలబెట్టాలని 17 పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ సాయంకాలం ఎన్ సిపి నేత శరద్ పవార్ నివాసంలో ఈ పార్టీలు సమావేశమయ్యాయి. మీరాకుమార్‌ను రంగంలోకి దించడం మీద ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

 

తమతో సంప్రదించకుండా దళిత నేత రామ్ నాథ్ కోవింద్ పేరు ను బిజెపి తెరమీదకు తీసుకువచ్చిందని ప్రతిపక్ష పార్టీ అసంతృప్తితో ఉన్నాయి. అందుకే గెలవడం కష్టమని తెలిసినా అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించాయి.

 

లోక్ సభ స్పీకర్ గా  కేంద్రమంత్రిగా కాంగ్రెస్ నేత మీరా కుమార్ సేవలందించారు. ఈ నెల 27న లేదా 28న ఆమె నామినేషన్ వేయనున్నారు. మీరాకుమార్ నామినేషన్ పై సంతకాల సేకరణకా  విపక్షాలు ప్రారంభించాయి. దళిత అభ్యర్థిని నిలబెట్టి ప్రతిపక్షపార్టీలు తప్పనిసరిగా కోవింద్ ను సమర్థించేలా చేయాలనుకున్న బిజెపి వ్యూహం ఇపుడు ఇద్దరు దళిత అభ్యర్థుల మధ్య పోటీ రాష్ట్ర పతి ఎన్నిక మారింది.

 

ఇలా ఉంటే, కోవింద్ ను సమర్థించే విషయం మీద పునరాలోచన చేయాలని  బీహార్ ముఖ్యమంత్రి నితిష్  కుమార్ ను బీహార్ ప్రభుత్వం లో భాగస్వామి ఆర్ జెడి నేత లాలూ ప్రసాద్ కోరారు.

click me!