డిగ్రీ పాస్ అయితేచాలు.. ఇస్రోలో ఉద్యోగం

First Published Apr 11, 2018, 12:24 PM IST
Highlights
నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు మరో శుభవార్త. డిగ్రీ పాసు అయ్యి.. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది నిజంగా సువర్ణ అవకాశం. మీరు చదివింది నిజమే. ఇస్రో(  ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టీనోగ్రాఫర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30( ఏప్రిల్ 30) లోపు దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకి 166 ఖాళీలు, స్టీనోగ్రాఫర్  పోస్టుకి 5 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి ఎంపికైన వారికి అహ్మదాబాద్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, హైదరాబాద్, సికింద్రాబాద్, నెల్లూరు, తిరువనంతపురంలో పోస్టింగ్ ఇస్తారు.

ఈ రెండు పోస్టుకి కావాల్సిన  విద్యా, వయసు అర్హతలు...
ఆర్ట్స్, కామర్స్ , మేనేజ్ మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఏదో ఒకదానిలో డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉండాలి. డిప్లమా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారికి కనీసం ఒక సంవత్సరం పాటు స్టీనోగ్రఫీలో అనుభవం ఉండితీరాలి.

ఏప్రిల్ 30వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 26 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ కి 31 ఏళ్లు, ఓబీసీ వారికి 29 ఏళ్ల వయసు సడలింపు ఉంది. ఇస్రో అధికారిక వైబ్ సైట్ ఓపెన్ చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.isro.gov.in లాగిన్ అవ్వండి.
 

click me!