
చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను వ్యతిరేకిస్తూ హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఐపీఎల్ మ్యాచ్‌లను వ్యతిరేకిస్తూ మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా వారు పోలీసులపై దాడులకు దిగారు. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని ఆటగాళ్లపైకి ఇద్దరు కార్యకర్తలు మైదానంలోకి బూట్లు విసిరారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటువంటి నిరసనలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. పోలీసులపై దురుసుగా వ్యవహరించిన వారిని శిక్షించేందుకు మన దేశంలో కఠిన చట్టాలు అవసరమని రజనీ అభిప్రాయపడ్డారు.