అనంతపురం ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి

First Published Jun 27, 2017, 11:03 AM IST
Highlights

అనంతపురం లో ప్రారంభించాల్సిన సెంట్రల్ యూనివర్శీటి అమరావతికో మరోజిల్లాకో ఎత్తుకు పోతారనే భయం జిల్లాలో మొదలయింది. ఎయిమ్స్ పోయినట్లే సెంట్రల్ యూనివర్శిటీ కూడా దక్కదేమో అని అనుమానాలు ప్రజల్లో ప్రబలుతున్నాయి. అందుకే కేంద్ర విశ్వవిద్యాలయాన్ని అనంతపురంలోనే తక్షణం ప్రారంభించాలని మాండ్ చేస్తూ శనివారం నుంచి  దీక్ష చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.

అనంతపురం లో ప్రారంభించాల్సిన సెంట్రల్ యూనివర్శీటి అమరావతికో మరోజిల్లాలో ఎత్తుకుపోతారనే భయం జిల్లాలో మొదలయింది. ఎయిమ్స్ పోయినట్లే సెంట్రల్ యూనివర్శిటీ కూడా దక్కదేమో అని అనుమానాలు ప్రజల్లో ప్రబలుతున్నాయి.

 

కారణం, గత మూడేళ్లుగా ఈ సంస్థ  ప్రతిపాదన ముందుకు సాగనే లేదు. కేంద్రం హామీ ఇచ్చిన కేంద్ర సంస్థలన్నింటిని ప్రారంభించడమో, నిర్మాణానికి శంకు స్థాపన చేయడమో జరిగింది.మాటల్లో తప్ప భూమ్మీద కనిపించడని ఒక్క అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీయే. ప్రయివేటు యూనివర్శిటీలతో అమరావతిని ఎజుకేషన్ హబ్ గామా ర్చాలనుకుంటున్నప్రభుత్వం సెంట్రల్ యూనివర్శిటీని కూడ అక్కడి కే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నే ఈ ప్రతిపాదన అమలు మీద శ్రద్ధ చూపడంలేదని రాయలసీ విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే కేంద్ర విశ్వవిద్యాలయాన్ని అనంతపురంలోనే ఏర్పాటు చేయాలని, వెంటనే ప్రారంభించాలని డిమాండ్ శనివారం నుంచి  దీక్ష చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.

 

రాష్ట్రం విడిపోయినప్పటి నుండి రాయలసీమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని వారు విమర్శిస్తున్రు.

◆శ్రీభాగ్ ప్రకారం కర్నూల్ కు రావలసిన రాజధానిని ఏకపక్షంగా అమరావతిలో ఏర్పాటు చేయడం,

◆120 GO ద్వారా మన సీమ ఆడపిల్లల మెడికల్ సీట్లు కోస్తా వారికి దక్కేలా చెయ్యడం,

◆అనంతపురం కు అసెంబ్లీ సాక్షిగా ఇస్తా అన్న ఎయిమ్స్ మంగళగిరి లో ఏర్పాటు చేయడం,

◆విభజన చట్టంలోని కడప ఉక్కు ఊసే ఎత్తకపోవడం,

◆రాయలసీమ దశాబ్దాల కల అయిన గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు చెయ్యక పోవడం,

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సెంట్రల్ యూనివర్సిటీ లో దేశ, విదేశాల్లోని విద్యార్థులు చదువును అభ్యసిస్తారు అలాగే నిష్ణాతులైన ప్రొఫెసర్లు అందుబాటులోకి వస్తారు. ఇలా ఇతర రాష్ట్ర మరియు దేశ ఆచార్యులు/విద్యార్థుల వల్ల స్థానిక విద్యావ్యవస్థ బాగుపడడం తో పాటు స్థానిక సీమ సమస్యలు వీరి ద్వారా ఇంకా వెలుగులోకి వస్తాయి. ఇంతటి మేలు జరిగే యూనివర్సిటీని కోల్పోకూడదని ఈ జాప్యం వెనక ఉన్న మోసాన్ని కలసి కట్టుగా ఎదిరించాలని పలు రాయలసీమ సంఘాలు శనివారం నిరసన దీక్షకు పిలుపు నిచ్చాయి.

 

click me!