
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10 వేలం ఇప్పుడే ముగిసింది. మండే ఎండల్లో సరికొత్త మజా చూపించే ఈ చిట్టిపొట్టి క్రికెట్ కు దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.
లీగ్ లో ఈ సారి రికార్డుస్థాయిలో ఆటగాళ్లు ధర పలికారు. కొన్ని ప్రాంచైజీలు ఆశ్చర్యంగా అనామక ఆటగాళ్లకు కూడా కోట్లు పెట్టి దక్కించుకున్నారు.
మొత్తంగా చూస్తే ఈ సారి లీగ్ లో అత్యధికంగా ధర పలికింది ఇంగ్లాండ్ ఆటగాళ్లే. భారత్ లో వారు మంచి ఆటతీరు కనబర్చడం వల్లే ఇది సాధ్యమైందని అనుకోవచ్చు.
తైమాల్ మిల్స్ ... బహుశా ఈ పేరు పెద్దగా వినేఉండరు. ఇతని అంతర్జాతీయ క్రికెట్ వయసు కేవలం నాలుగు టీ20లు మాత్రమే. తీసింది కేవలం 3 వికెట్లే. ఇంగ్లాండ్ కు చెందిన ఈ బౌలర్ ను పుణె వారియర్స్ రూ. 12 కోట్లు పెట్టి కొనుగోళు చేసింది.
బెన్ స్టోక్స్... ఈ సారి ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ను పుణె వారియర్స్ రూ.14.5 కోట్లు పెట్టి తమ సొంతం చేసుకుంది.
మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు దిగే స్టోక్స్ హార్డ్ హిట్టర్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. ఇటీవల భారత పర్యటనలో కూడా దూకుడు చూపించాడు.
ఈసారి ఐపీఎల్ వేలంలో అఫ్ఘాన్ కూడా బోణి కొట్టింది. ఆ దేశానికి చెందిన మొహ్మద్ నబీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షల పెట్టి కొనుగోళు చేసింది.
అచ్చంగా మన ధోనీలా బ్యాంటింగ్ చేసే నబీ మంచి ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా. ఆఫ్ఘాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా, 73 వికెట్లు తీశాడు.