కెప్టెన్ కూల్ షాకింగ్ నిర్ణయం

First Published Feb 19, 2017, 10:07 AM IST
Highlights
  • ఐపీఎల్ సారథ్యం నుంచి అవుట్

టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఏమైంది..

 

విజయవంతమైన కెప్టెన్ గా తన పేరుతో ఎన్నో రికార్డులు లిఖించుకున్న కెప్టెన్ కూల్ నిర్ణయాలు అభిమానులకు నిజంగా అంతుపట్టడం లేదు.

 

మైదానంలోనే కాదు బయటకూడా అతడి వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

ఇటీవల టీం ఇండియా కెప్టెన్సీని వదులుకున్న మహీ ఇప్పుడు ఐపీఎల్ లోనూ అదే పని చేశాడు.

 

తాను ప్రాతినిథ్యం వహిస్తన్న ఐపీఎల్‌ జట్టు పుణె రైజింగ్‌ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

 

ఈసారి జరిగే ఐపీఎల్‌-10 సీజన్‌లో జట్టుకు ధోనికి బదులుగా ఆస్ట్రేలియా క్రికెటర్  స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్ గా జట్టును నడపనున్నాడు.

 

ఐపీఎల్‌-9లో పుణు దారుణంగా విఫలమైంది. ఈ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడితే కేవలం ఐదు మ్యాచ్‌లే గెలిచింది.

 

ధోనీనే స్వయంగా పుణె జట్టు యాజమాన్యాన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని కోరినట్లు తెలిసింది.

 

తన సారథ్యంలో జట్టు విఫలమవడం వల్లే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక ఇకపై బ్యాట్స్ మెన్ గా ఒత్తిడి లేకుండా ఆడటానికి ఈ పనిచేశాడా అనేది తెలియలేదు.

 

అయితే సభ్యుడుగా పుణు జట్టుకు ధోనీ అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం తెలిపింది.

click me!