రూ.5వేలకన్నా తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్

Published : Feb 12, 2018, 04:29 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
రూ.5వేలకన్నా తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్

సారాంశం

బడ్జెట్ ధరలో ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఇంటెక్స్.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. చైనా కి చెందిన షియోమి కంపెనీ ప్రేమికుల రోజున రెడ్ మీ 5 విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా..  ఈ ఫోన్ కి పోటీగా ఇంటెక్స్ ఫోన్ విడుదల చేసింది. ‘ ఆక్వా లయన్స్ టి1 లైట్ ’ పేరిట ఈ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.4,449గా కంపెనీ ప్రకటించింది.

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ టి1 లైట్ ఫోన్ ఫీచర్లు..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,

720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

 1 జీబీ ర్యామ్,

 8 జీబీ స్టోరేజ్,

64 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 7.0 నూగట్,

 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,

2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu