బెంగాల్ లో అమిత్ షాకు అన్నం పెట్టినోళ్లు ఏమయ్యారు?

First Published May 3, 2017, 7:43 AM IST
Highlights

అమిత్‌షాకు అన్నం పెట్టిన  రాజు కుటుంబం ఒక రాత్రంతా మాయం కావడం పట్ల  బిజెపి నాయకులు ఆశ్చర్యం పోతున్నారు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటనని నక్సల్‌బరి నుంచి ప్రారంభించి న సంగతి తెలిసిందే. నక్సల్ బరీ  నక్సలైట్లకు జన్మస్థానం. కమ్యూనిజం మాయమయి, ఇక కాషాయం వస్తోందని చెప్పేందుకు ఆయన తన  మిషన్ బెంగాల్ యాత్రకు నక్సల్బరీ ఎంచుకున్నారు.

 

అంతేకాదు, తనెంత పేదల మనిషో చెప్పడానికి నక్సల్బరీ సమీపంలోని దక్షిణ కథియాజోట్‌ గ్రామంలో రాజు మహాలీ అనే పెయింటర్‌ ఇంట్లో భోజనం చేశారు. నేల మీద కూర్చుని అరిటాకులో అన్నం, పప్పు, కాకర వేపుడుతో భోజనం చేశారు. ఈ  చిత్రం వైరల్‌ అయింది.  ఈ సన్సేషనల్ ఘటన జరిగి వారం అయిందో లేదో రాజుకుటుంబం మంగళవారం రాత్రి మాయమయిది. బుధవారం పొద్దునే తృణమూల్ నాయకుడు గౌతమ్ దేబ్ తో కలసి ప్రత్యక్ష మయింది.అంతేకాదు, తాము తృణమూల్ కాంగ్రెస్ లో చేరినట్లు, ఆ పార్టీ కోసం పనిచేయబోతున్నట్లు కూడ రాజుప్రకటించాడు, ఏడుస్తూ. వాళ్ల మీద పార్టీ వత్తడేమీ లేదని కూడ దేబ్ న్యూస్18 తో అన్నారు.

 

 అమిత్‌షాకు అన్నం పెట్టిన ఆ దంపతులు ఏలా మాయమ్యారు, ఎక్కడిపోయారు అనేది చర్చనీయాంశమయింది. రాజు కుటుంబం కనిపించడం లేదని  బిజెపి నాయకులు ఆశ్చర్యంగా చెబుతున్నారు.అపుడే  ఈ విషయం మీద నక్సల్‌బరీ పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ  ఫిర్యాదు కూడా చేసింది.

 

అమిత్‌షా ఇలా బెంగాల్ పర్యటనకురావడం, పేదలను ఆకట్టు కునేందుకు పేదవాడి ఇంట భోజనం చేయడం తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, ఫలితంగా షా వెళ్లిపోయాక తృణమూల్  నేతల నుంచి రాజు, భార్య గీత అసంతృప్తి ఎదుర్కొంటున్నారని బిజెపి వాళ్ల ఆరోపణ.  వాళ్లే రాజు దంపతులను కిడ్నాప్ చేశారని వారు పోలీసులకిచ్చిన ఫిర్యాదు లో బిజెపి నేతలు పేర్కొన్నారు.

 

 

click me!