
మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు శ్రీశైలాన్ని "పర్వతం" అనేవారు,శ్రీశైలం అని పిలవరు.చరిత్రలో కూడ శ్రీశైలాన్ని శ్రీపర్వతం అని ప్రస్తావించారు.
శ్రీశైలం నలమల అడువుల మధ్యలో వుంది.శ్రీశైలానికి నాలుగు ద్వారాలు.ఉత్తరాన- ఉమామహేశ్వరం,దక్షిణాన- సిద్దవటం, పశ్చిమాన - అలంపురం, తూర్పున- త్రిపురాంతకం.
గమనిస్తే ఈ నాలుగు ద్వారాలు నలమల అడివికి నాలుగు దిక్కుల హద్దులు.సిద్దవటం వున్న అడివిని "లంకమల" అని ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు కాని భౌగోళికంగా అది కూడ నలమలో బాగమే. మైదుకూరు/బద్వేల్ ప్రాంతంలో వున్న అడవిలో లంక మల్లేశ్వరుడిని ఆరాధించటం వలన ఆ అడవిి బాగాన్ని లంకమల అంటున్నారు.
"పుడమిని అణువు అణువు అరసి అరసి చూడవలే" అన్న దేవులపల్లి గారి మాటా నా మీద మంచి ముద్ర వేసుకున్నాయి.ఏది చూసిన వివరంగా చూడాలి.ఈ మనస్తత్వంతోనే నలమలోని ఉత్తరబాగాన్ని అంటే ఉమామహేశ్వరం నుంచి కదలివనం వరకు తిరిగి చూశాను. రెండ ఫోటోలో వున్న క్షేత్రాలలో లొద్ది,సలేశ్వరం చూడలేదు కాని ఆప్రాంతంలో తిరిగాను.
మొన్న నా భారత యాత్రలో ఉత్తర నలమలలో చివరి క్షేత్రం అయిన కదలీవనం చూసాను.మన్ననూరు నుంచి జీపులో 30 కి.మీ అడవిలొ ప్రయాణించి మేడిమల్కల్ చేరుకోని అక్కడి నుంచి 7 కి.మీ(తిరుగు ప్రయాణంతో కలిపి 14 కి.మీ) నడిచి కదలీవనం చేరుకున్నాము.
కదలీవనం దారి పులి తిరిగే ప్రాంతమే కాని అంతగా భయపడవలసిన అవసరంలేదు.అక్కడి చెంచులు పులి సంచారాన్ని ముందే పసిగడతారు. పులి కూడ మనుష్యుల మీద అనవసరంగా దాడి చేయదని చెంచులు చెప్పారు.మమ్మల్ని అడవిలోకి తెసుకెళ్ళిన బాలకృష్ణ పులిని చూశారు,ఒకసారి వాళ్ళ జీపుకు ఎదురుగా వచ్చి పులి కూర్చుందంట.
కదలీవనంలో కొండ అంచు చిన్న గుహలా ఏర్పడింది.ఇక్కడ అక్కమహాదేవి తపస్సు చేసిందని నమ్ముతారు.కదలీవనానికి 3 కి.మీ దూరంలో "దత్త"పాదుకలు వున్నాయి.దత్త అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడ అంతర్ధానం అయ్యారని భక్తులు నమ్ముతారు.
కదలీవనానికి శ్రీశైలం నుంచి బోటులో యాత్రికులను టూర్ ఆపరేటర్స్ ను తీసుకొస్తున్నారు.ఈ దారిలో అయితే దాదాపు 3 కి.మీ నడిస్తే కదలీవనం చేరుకొవచ్చు కాని చాలా వరకు కొండ ఎక్కాలి. కొంతమంది యాత్రికులు కదలీవనంలో రాత్రి బసచేస్తున్నారు
రెండవ ఫోటోలో వున్న క్షేత్రాల ఫోటోలొ & వివరాలు కోసం ఫోటోలు చూడండి.
ఈ జూన్ లొ మళ్ళి ఇండియాకు వస్తున్నాను.ఈసారి దక్షిణ నలమలలోని నాగులూటి, పెచ్చెరువు, భీముని కొలను చూడాలని టార్గెట్ పెట్టుకున్నాను. నాగారెడ్డి, సహదేవ రెడ్డి అన్నలు, మీరే తీసుకెళ్ళాలి.
నాగరికత అంతా నది మార్గంలోనే పెంపొందిందని నానమ్మకం. రాజ్య విస్తరణ,వలసలు కూడ నదీ వెంటనే జరిగాయి.
నట్టనడి అడవిలొ వున్న శ్రీశైలం ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? (కనీసం) 12 వందల సంవత్సరాల కిందట అన్ని వైపుల నుంచి శ్రీశైలం ఏలా చేరుకున్నారు అని నాకు వచ్చిన అనుమానం తీరుచుకోవటానికి కొంచం రీసెర్చ్ చేసాను.కింది వివరాలు 3 సంవత్సరాల క్రింద రాసుకున్నవి, ఇప్పుడు కొంచం డెవెలప్ చేయ్యొచ్చు.
"నదిని ఎక్కడ దాటారు" అన్నది నాకు ఇప్పటికి ఆసక్తికరమైన అంశం.
శ్రీశైలం 2,3 శతాభ్ధాల నాటికే ఒక రాజ్యంగా విరజిల్లింది.చాళుక్య పాలనలో(6 శతాబ్ధం) తరువాత బాగా అభివృద్ది చేందింది.12వ శతాభ్ధంలొ జరిగిన పలనాడు చరిత్రలో అరణ్యవాసంలో బ్రహ్మనాయుడు శ్రీశైల రాజు దగ్గర కత్తిని(అది విష్ణు ప్రసాదం అని ప్రచారం) అప్పు తీసుకోని మాచెర్ల రాజ్యాన్ని అభివృద్దిచేస్తాడు.
బసవన్న,పండితారాధ్య మల్లికార్జున చరిత్రలో శ్రీశైలం గురించి అనేక వివరాలు వున్నాయి.శివాజి శ్రీశైలం రావటానికి కారణం ఆ క్షేత్రంలో వున్న "ఆత్మత్యాగ" సాంప్రదాయం కారణం కావొచ్చని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.
చరిత్ర గురించి పాత పోస్టు
బైరాపురం గుడికి సంబంధించి నాదగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు.కాని ఈ గుడికి అతి దగ్గరలో 5-8 కిమీ దూరంలో అదే అడవిలో వున్న "లొద్ది","సలేశ్వరం"(ఇవి కూడా శివాలయలే) మరికోద్ది దూరంలో వున్న "ఉమామహేశ్వరం" గుడుల చరిత్రకు సంబంధించి కచితమైన ఆధారాలు వున్నాయి. 4/5వ శతాభ్దానికి చెందిన "విష్ణుకుండికుల" మొదటి రాజధాని ఇప్పటి "అమ్రాబాద్".
ఇప్పటి మన్ననూర్ను కేంద్రంగా తీసుకుంటే ఉత్తరంగా ఉమామహేశ్వరం 15 కి మీ (అడవి దారి కేవలం 4 కిమీ), పశ్చిమంగా అమ్రాబాద్ 35 కిమీ,తూర్పుగా లొద్ది 10 కిమీ,దక్షిణంగా సలేశ్వరం, బైరాపురంలు 25కిమీ దూరంలో వున్నాయి.
ఉమామహేశ్వరం,లొద్ది,సలేశ్వరం గుడులను ఈ విష్ణుకుండికులే కట్టించారు.వీటికి అతి సమీపంలో ఈ గుడులకు వెల్లే దారిలో వున్న బైరాపురం గుడిని వీళ్ళే కట్టించారు అనుకోవటానికి పెద్దగా చారిత్రిక ఇబ్బందులు లేవు.
ఈ విష్ణుకుండికులే తరువాత కాలంలో "కీసర" రాజధానిగా పరిపాలించారు,కీసర గుట్టమీద 108 శివలింగాలు ప్రతిష్టించారు, ఇప్పటికి చాలావరకు అవి వున్నాయి.వీళ్ళు కట్టించిన అన్ని శివాలయాల నిర్మాణంలో "ఇటుక" మరియు "గచ్చు"ను వాడారు.
1160 నుంచి 1200 సంవత్సరాల మధ్య మనవైపు "మల్లికార్జున పండితారాద్యుడు ," కర్నాటక వైపు "బసవేశ్వరుడు" చేసిన వీరశైవం ఉద్యమం చాలావరకు మనకు చరిత్రను తెలియచేస్తుంది.
చాలా మంది చరిత్రకారులు "పాల్కురి సోమనాధుడు" 1300 (దాదాపు) సంవత్సరంలో రాసిన "పండితారాధ్య చరిత్ర"ను ఆధారంగా చాలా విషయాలను రూఢి చేశారు .బైరాపురం స్థానికులు ఈ గుడిని "పార్వతీ దేవి" గుడిగా చెప్తారు. ఇప్పటికి ప్రతి సంవత్సరం కర్నాటక నుండి ఉగాది ముందు ఇక్కడ యాగం చేసి శ్రీశైలం కు వెళ్తారు."భౌరాపురం గుడి" 100 కు 100 శాతం శ్రీశైలముకు ఉత్తర ద్వారమైన "ఉమ మహేశ్వరం" నుండి "శ్రీశైలం"కు వెళ్ళే దారిలోనే వుంది. ఈదారిలో "క్రిష్ణా"నదిని ఎక్కడ దాటి ఆవలి ఒడ్డున వున్న "శ్రీశైలం" కు వెళ్ళి వుంటారు అన్న దానిమీద కొంత పరిశోధన చేసాను.
"చింతా దీక్షితులు" గారు 1940,50లలో నలమల్ల చెంచుల మీదా చాలా కథలు రాశారు.అందులో "చెంచు రాణి" అనే కథలో మన్ననూరు వైపు నుండి కథా నాయకి ఆవలి ఒడ్డున(శ్రీశైలం వైపు) వున్న నాగులేటి అనే పెంటకు వెళ్తుంది.తన కొడుకు మరల ఇటువైపు వున్న తన తల్లి పుట్టిన పెంట "పీనుగుల గొంది" కి చెంచు రాణి చెప్పిన directions ఆధారంగా ముఖ్యంగా అడివిలో క్రిష్ణ నది "తూర్పు కు తిరిగి ప్రవహించే చోట గుహలు" అనే ఆధారంగా వస్తాడు.ఇప్పుడు దీన్ని "అక్క మహాదేవి గుహలు" అంటున్నారు.
నేను కచ్చితంగా చెప్పగలను పూర్వికులు ఇక్కడనే నదిని దాటారు.ఇక్కడ నీటి ప్రవాహం చాలా నెమ్మది.సుమారు 12వ శతాబ్ధం నుంచి "అక్కమహాదేవి గుహల" ప్రస్తావన వుంది.ఈ గుహల గురించి తెలియ కుండా,యాదృచ్చికంగా ఇక్కడికి రావటం అసంభవం.
ఒక అనుమానం రావచ్చు ఉమ మహేశ్వరం నుండి ఈ దారిలోనే ఎందుకు శ్రీశైలం వెళ్ళి వుంటారు అని?సమాధానం చాలా సింపుల్
ఈ దారి వాగు(creek) దారి,ఇప్పటికి చాలా వాగులు అక్కడ వున్నాయి,అన్ని క్రిష్ణలోనే కలుస్తున్నాయి,ఈ 1600,1700ల సంవత్సరాలలో వాగుల దిశ కొంత మారి వుండవచ్చు.
సాదారణంగా నదిలో మరో ఉప నదో,వాగో కలిసి దగ్గర ప్రవాహ ఉదృతి ఎక్కువగా వుంటుంది అందుకే కొంత కింది వైపున అక్కమహాదేవి గుహల దగ్గర నదిని దాటివుంటారు అని చెప్పగలుగుతున్నను.
చరిత్రలో కొన్ని చోట్ల "కదలీవనం" అని కని పిస్తుంది అది ఈ భౌరాపురం ప్రాంత దిగువున క్రిష్ణా ఓడ్డున వుంటుంది.(కింది ఫోటో బౌరాపురం అమ్మవారు)
(‘పేస్ బుక్‘ నుంచి. పూర్తి పోస్టు ఇక్కడ చూడండి )