కర్ణాటక ఇలా దారి చూపిస్తోన్నది

Published : Sep 27, 2017, 02:09 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
కర్ణాటక ఇలా దారి చూపిస్తోన్నది

సారాంశం

కర్ణాటక ఆస్పత్రుల్లో ఇందిరా క్యాంటీన్లు రోగులకు మంచి ఆహారం అందిస్తామంటున్న సీఎం  

చేతిలో డబ్బు ఉన్నవారికి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. వెంటనే ప్రైవేటు ఆస్పత్రులకు పరగులు తీస్తారు. పేదలు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు.. రోగుల బాగోగులన్నీ దగ్గరుండి చూసుకుంటారు. వారి వెంట ఉండే కుటుంబసభ్యులకు కూడా వసతి లభిస్తుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంత వెసులు బాటు ఉండదు. అక్కడ రోగులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా అవస్థలు పడాల్సి వస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో అయితే.. రోగి కుటుంబసభ్యులు ఆస్పత్రి సమీపంలోని చెట్ల కిందే వంటలు వండుకొని తింటుంటారు. ఆ చెట్ల కిందే నిద్రపోతుంటారు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. డబ్బులు చెల్లించి కొనుక్కొని తినలేని పరిస్థితి. వారి సమస్యకు కర్ణాటక ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇందిర క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఈ ఇందిర  క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య వెల్లడించారు.

 అతి తక్కువ ధరకే ప్రజలకు ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ ఇందిర క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. మరో 50 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా క్యాంటీన్లు పెడతామని చెప్పారు. ఒకవేళ క్యాంటీన్ పెట్టడానికి స్థలం లేకపోతే.. ప్రైవేటు సంస్థలకు చెందిన భవనాలను అద్దెకు తీసుకొని మరీ నడుపుతామని చెబుతున్నారు. రోగులకు మాత్రం మంచి హైజనిక్ ఆహారాన్ని అందిస్తామని చెప్పారు.

భాజపా అధికారంలో కర్ణాటక రాష్ట్రం కొంత కూడా అభివృద్ధి సాధించలేదని సిద్ధారామయ్య చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి చెందిందన్నారు. పౌరకార్మికులకు తాము అధికారంలోకి వచ్చాకే వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేశామని.. వారికి నెలకు రూ.17వేల జీతం ఇస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ తామే   అధికారంలోకి వస్తామని సిద్ధారామయ్య చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !