టెక్కీస్ ఇలా చేయాల్సిందే.. లేకుంటే ఉద్యోగానికే ఎసరు

First Published Jan 3, 2018, 5:47 PM IST
Highlights
  • కొత్తగా అమెరికా వెళ్లాలని అనుకునేవారు, ఇప్పటికే వెళ్లిన వారు.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు

అమెరికా ప్రభావం.. భారత్ పై బాగా పడుతోంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్ని నిర్ణయాలు.. భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు, ఉద్యోగులకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే ట్రంప్.. అమెరికాలోని ఉద్యోగాలన్నీ కేవలం అమెరికన్లకు మాత్రమే ఇవ్వాలనే నియమాన్ని పెట్టారు. దీని ద్వారా.. కొత్తగా అమెరికా వెళ్లాలని అనుకునేవారు, ఇప్పటికే వెళ్లిన వారు.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. తాజాగా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇచ్చిన ప్రతిపాదన ఒకటి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై పెద్దఎత్తున ప్రభావం చూపనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డ్‌ కు దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై హెచ్‌1-బీ వీసాను పొడిగించుకునే వీలులేకుండా చేయాలన్న నిబంధనే ఇందుకు కారణం. ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. దాదాపు 50వేలు నుంచి 75వేల మంది హెచ్1 బీ వీసా వినియోగదారులు స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.   

అయితే.. కేవలం అమెరికాలో మాత్రమే కాదు.. భారత్ లో ముందుకు సాగాలన్నా.. ఇండియన్ టెక్కీస్ అంతా ఒక పని తప్పక చేయాలంటున్నారు నిపుణులు. టెక్నాలజీకి తగట్టుగా.. అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించకపోతే.. చివరకు ఉద్యోగమే కోల్పోవలసి వస్తుందని చెబుతున్నారు. ఇదే విషయంపై నాస్ కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎఫ్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. అలా నేర్చుకోకపోతే వాళ్లు వెనకపడిపోతారని, చివరకు ఉద్యోగం కూడా పోతుందని సూచించారు. టెక్నాలజీలో రోజుకి రోజు మార్పు వస్తుందని.. ఒక టెక్నాలజీకి ఎక్కువ కాలం సమయం ఉండటంలేదని.. వెనువెంటనే మరో కొత్త టెక్నాలజీ వస్తోందని విప్రో చీఫ్ సెక్రటరీ రిషద్ ప్రేమ్ జీ చెప్పారు. అందుకే ప్రతి ఉద్యోగి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ కొత్త సీఈవొ  సలిల్ పరేఖ్ కూడా ఇదే విషయాన్ని వారి కంపెనీ ఉద్యోగులకు సూచించడం గమనార్హం.

click me!