బిగ్ బాస్ తో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది

Published : Jan 03, 2018, 04:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
బిగ్ బాస్ తో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది

సారాంశం

బిగ్ బాస్ షోతో  క్రేజ్ సంపాదించుకున్న జూలీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం

 సెలబ్రెటీ రియాల్టీ షో ‘‘బిగ్ బాస్’’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ షోని  తెలుగు, తమిళ ప్రజల ముందుకు కూడా తీసుకువచ్చారు. ఈ బిగ్ బాస్ షోతో చాలా మంది పాపులారిటీ సంపాదించారు. అయితే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి అయితే.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మెరీనా బీచ్ లో జల్లికట్టు ఉద్యమం ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించిన  యువతి జూలీ.  ఆ తర్వాత ఆమె కమల్ హాసన్ హోస్ట్ గా నిర్వహించిన తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోతో జూలీ కి చాలా పాపులారిటీ వచ్చింది. కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా చేస్తోంది. కాగా.. తాజాగా ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కే7 ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న కొత్త చిత్రంలో జూలీ హీరోయిన్ గా ఎంపికైంది. దురై సుధాకర్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. సినిమా కథ నచ్చడంతో ఈ సినిమాలో నచ్చడానికి ఒప్పుకున్నట్లు జూలీ చెబుతోంది. మరి సినిమాల్లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu