
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తోన్న కోహ్లీ సేన ఇప్పటికే 4-0తో సిరీస్ గెలిచింది. అయితే స్టార్ బౌలర్ లతీష్ మలింగ ఇంట్లో జట్టు సభ్యులందరు సందడి చేశారు. ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ వికెట్ తీయడం ద్వారా మలింగ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల కోసం శ్రీలంక ఆటగాడు లతీశ్ మలింగ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ సంబరాలకు జట్టు సభ్యులు అందరు హాజరయ్యారు.
మలింగ ఇంట్లో విందులో పాల్గొన్న సమయంలో దిగిన ఫొటోలను శిఖర్‌ధావన్, రోహిత్ శర్మ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇరు జట్ల మధ్య చివరి వన్డే సెప్టెంబరు 3న జరగనుంది.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి....