లంకను చిత్తుగా ఓడించిన ఇండియా

First Published Aug 20, 2017, 9:40 PM IST
Highlights
  • ఘన విజయం సాధించిన టీం ఇండియా.
  • శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి భార‌త్‌ ల‌క్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ ధావన్ అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ కోహ్లీ దూకుడుతో భారత్ సునాయాస విజయం సాధించింది.

భారత ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ 90 బంతుల్లో 132 ప‌రుగులు చేశారు. అందులో ఏకంగా 98 ప‌రుగులు కేవ‌లం ఫోర్ల, సిక్స్‌ల నుండి రాబ‌ట్టాడు, (20*4, 3*6). కెప్టెన్ విరాట్ కోహ్లీ 70 బంతుల‌కు 82 ప‌రుగులు చేశాడు. (10*4,1*6). ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 4 ప‌రుగుల‌కే నాట‌కీయంగా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.
 
 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. 

భార‌త్ ఈ విజ‌యంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ కు 1-0 అధిక్యం లభించింది. భారత్ బౌలింగ్ బృందం అద్బుతంగా లంక బ్యాట్స్‌మెన్ల‌ను క‌ట్ట‌డితో అకట్టుకుంది. అక్సర్ పటేల్ మూడు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, వైఎస్ చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

click me!