తగ్గిన బంగారం ధర

First Published Jan 19, 2018, 4:22 PM IST
Highlights
  • పదిగ్రాముల బంగారం ధర రూ.30,830
  • కేజీ వెండి ధర రూ.39,850

పసిడి ధర తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. శుక్రవారం రూ.110 తగ్గి తులం బంగారం ధర రూ.30,830కి చేరింది.  గత కొద్ది రోజులుగా పెరుగతూ వస్తున్న బంగారం.. ఇప్పుడు కాస్త తగ్గిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోళ్లు మందగించడంతో పసిడి ధర తగ్గందని నిపుణులు తెలిపారు. గురువారం ట్రేడింగ్ లో రూ.పసిడి ధర రూ.150 తగ్గింది.

బంగారం ధర తగ్గుముఖం పట్టగా.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. రూ.50 పెరగడంతో కిలో వెండి రూ.39,850కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.38శాతం పెరగడంతో ఔన్సు 1,331.40డాలర్లు పలికింది. వెండి 0.59శాతంతో ఔన్సు 17.03 డాలర్లు పలికింది.

click me!