జియో, ఎయిర్ టెల్ కి పోటీగా ఆఫర్లు ప్రకటించిన ఐడియా

First Published Feb 15, 2018, 3:22 PM IST
Highlights
  • ఆఫర్లు ప్రకటించిన ఐడియా
  • ప్లాన్లను అప్ గ్రేడ్ చేసిన ఐడియా

ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ లు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఇతర టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. కాగా.. జియో పోటీని తట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ జాబితాలో ఐడియా కూడా వచ్చి చేరింది. ఐడియా తాజాగా తన పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు పలు ప్లాన్లలో అందిస్తున్న బెనిఫిట్స్‌ లో మార్పులు చేసింది. ఇకపై ఐడియాలో రూ.499, రూ.649, రూ.999 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు మరింత మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. 

రూ.499 ప్లాన్‌లో ఐడియా పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు 40 జీబీ డేటా లభిస్తుంది. దీనికి గాను 200జీబీ వరకు డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ వర్తిస్తుంది. అంటే ఏ నెలలో అయినా కస్టమర్ ఇచ్చిన మొబైల్ డేటా మొత్తాన్ని వాడుకోకపోతే అది మరుసటి నెలలో లభించే మొబైల్ డేటాకు యాడ్ అవుతుందన్నమాట. అలా గరిష్టంగా 200 జీబీ వరకు మొబైల్ డేటాను డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ కింద ఈ ప్లాన్‌లో ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో గతంలో 30జీబీ డేటా మాత్రమే లభించేంది. ప్రస్తుతం దీన్ని 40జీబీకి పెంచారు. ఇక రూ.649 ప్లాన్‌లో గతంలో 45 జీబీ మొబైల్ డేటా ఇవ్వగా ఇప్పుడు 50 జీబీ డేటాను అందిస్తున్నారు. దీనికి కూడా 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ పరిమితి విధించారు. ఇక రూ.999 ప్లాన్‌లో కస్టమర్లకు గతంలో 70 జీబీ డేటా లభించగా, ఇప్పుడు దీన్ని ఇంకా పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్ వాడే కస్టమర్లు 80 జీబీ డేటా పొందవచ్చు. దీనికి కూడా 200 జీబీ డేటా రోల్ ఓవర్ లిమిట్ ఉంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

click me!