ఛీ.. ఈ మంత్రి రోడ్డు మీద ఏంచేసాడో తెలుసా..?

First Published Feb 15, 2018, 2:19 PM IST
Highlights
  • బహిరంగ మూత్ర విసర్జన చేసిన మంత్రి
  • వైరల్ గా మారిన ఫోటో

ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ‘‘స్వచ్ఛభారత్’’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలందరికీ అవగాహన కల్పిస్తుంటే.. మరో వైపు కొందరు ప్రజాప్రతినిధులే స్వచ్ఛభారత్ కి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.  ఇందుకు నిదర్శనమే రాజస్థాన్ మంత్రి  కాళీ చరణ్ సరఫ్. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి.. బహిరంగా మూత్రవిసర్జన చేయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీచరణ్ సరఫ్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద బహిరంగంగా మంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనను మంత్రి కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయంకాదన్నారాయన. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు.  ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటు

అయితే.. ప్రతిపక్ష నేతలు మాత్రం మంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు స్వచ్ఛభారత్ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే,  మంత్రి సరఫ్ ఇలా చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దోల్‌పూర్ ఉప ఎన్నికల సమయంలోనూ మంత్రి సరఫ్ ఇలాగే బహిరంగంగా మూత్ర విసర్జన చేశారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.

click me!