విదేశాల్లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

Published : Nov 16, 2017, 12:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
విదేశాల్లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

సారాంశం

విదేశీ ఉద్యోగాల పేరిట తమిళనాడు యువతకు మోసం 150 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన హైదరాబాద్ యువతి నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన 

విదేశాల్లో ఉద్యోగాల పేరిట తమిళ నాడు నిరుద్యోగ యువతకు ఎరవేసి,వారి నుండి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన సంఘటన మేడ్చెల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాంనగర్ కు చెందిన హేమలతా అనే యువతి కన్సల్టెన్సీ నడిపిస్తోంది. ఈ కన్సల్టెన్సీ ద్వారా కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని కొందరు తమిళనాడు యువతకు ఎర వేసింది. దీనికి గాను ఒక్కొక్కరి వద్ద దాదాపు 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. డబ్బులు కట్టి చాలా రోజులైనా ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు.
దీంతో తమ డబ్బులు తమకు వెనక్కి ఇప్పించాలని కోరుతూ 60 మంది బాధితులు నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ విధంగా హేమలత దాదాపు 150 మంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు పిర్యాధు చేసినట్లు, నిందితురాలిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !