టీఆర్ఎస్ కార్పోరేటర్ పై పోలీస్ కేసు

Published : Apr 17, 2018, 04:02 PM ISTUpdated : Apr 17, 2018, 04:08 PM IST
టీఆర్ఎస్ కార్పోరేటర్ పై పోలీస్ కేసు

సారాంశం

హైదరాబాద్ కు చెందిన ఓ టీఆర్ఎస్ కార్పోరేటర్ పై సొంత బావే కేసు పెట్టాడు. తన సంతకాన్ని రహ్మత్ నగర్ కార్పోరేటర్ షఫి అతడి సోదరులు ఫోర్జరీ చేశారని అబూబకర్ అనే వ్యాపారి సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఈ కుసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ మహ్మద్‌షఫి సోదరి ముంతాజ్‌బేగం కు యూసు‌ఫ్ గూడ శ్రీరాంనగర్‌కు చెందిన అబుబాకర్‌ బిన్‌ అహ్మద్‌ అనే వ్యాపారి కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితు వీరిద్దరికి మనస్పర్థలు రావడంతో 2011 లో విడాకులు తీసుకున్నారు. అయితే ముంతాజ్ సోదరులు షఫి తో పాటు రఫీక్‌, రషీద్‌,రహీం, కలీంలు విడాకులు తీసుకున్నాక కూడా తమ ఇద్దరి పేరుతో రేషన్ కార్డు ను తీసుకున్నారని అబూబకర్ పేర్కొన్నాడు. దీనికోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ రేషన్ కార్డు ఆధారంగా 2017లో  తనపై ఫ్యామిలీ కోర్టులో  డబ్బు కోసం దావా వేశారని అబూబకర్ తెలిపాడు.      కోర్టులో వారు సమర్పించిన పత్రాలను పరిశీలించగా అసలు విషయం బైటపడిందని అబూబకర్ తెలిపాడు. తన సంతకాలు ఫోర్జరీపై సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కార్పొరేటర్‌ షఫీతో పాటు అతని సోదరులపై పోలీసులు 420, 468, 471 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ రేషన్ కార్డును కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.    

హైదరాబాద్ కు చెందిన ఓ టీఆర్ఎస్ కార్పోరేటర్ పై సొంత బావే కేసు పెట్టాడు. తన సంతకాన్ని రహ్మత్ నగర్ కార్పోరేటర్ షఫి అతడి సోదరులు ఫోర్జరీ చేశారని అబూబకర్ అనే వ్యాపారి సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.

ఈ కుసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ మహ్మద్‌షఫి సోదరి ముంతాజ్‌బేగం కు యూసు‌ఫ్ గూడ శ్రీరాంనగర్‌కు చెందిన అబుబాకర్‌ బిన్‌ అహ్మద్‌ అనే వ్యాపారి కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితు వీరిద్దరికి మనస్పర్థలు రావడంతో 2011 లో విడాకులు తీసుకున్నారు. అయితే ముంతాజ్ సోదరులు షఫి తో పాటు రఫీక్‌, రషీద్‌,రహీం, కలీంలు విడాకులు తీసుకున్నాక కూడా తమ ఇద్దరి పేరుతో రేషన్ కార్డు ను తీసుకున్నారని అబూబకర్ పేర్కొన్నాడు. దీనికోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ రేషన్ కార్డు ఆధారంగా 2017లో  తనపై ఫ్యామిలీ కోర్టులో  డబ్బు కోసం దావా వేశారని అబూబకర్ తెలిపాడు.
    
కోర్టులో వారు సమర్పించిన పత్రాలను పరిశీలించగా అసలు విషయం బైటపడిందని అబూబకర్ తెలిపాడు. తన సంతకాలు ఫోర్జరీపై సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కార్పొరేటర్‌ షఫీతో పాటు అతని సోదరులపై పోలీసులు 420, 468, 471 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ రేషన్ కార్డును కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !