దొంగతనం కేసులో పోలీసులకు చిక్కిన టీవి యాక్టర్

First Published Apr 11, 2018, 4:19 PM IST
Highlights
ఇప్పటివరకు 17 ఇళ్లలో 72 తులాల బంగారం లూటీ

అతడో టివి చానెల్ లో ఆర్టిస్ట్ గా పలు కార్యాక్రమాల్లో పనిచేశాడు. అలాగే షూటింగ్ లు లేనపుడు కార్పెంటన్ గా పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ జల్సాలకు అలవాటు పడ్డ అతడికి ఈ డబ్బులు సరిపోలేదు. అందుకే దొంగగా మారాడు. తాళం వేసి వున్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఈ యాక్టర్ దొంగ గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన బర్రి నాగరాజు(23) వృత్తిరీత్యా కార్పెంటర్‌. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌లో ఉంటూ ఓ టీవీ సీరియల్‌లో చిన్న చిన్న క్యారెక్టర్‌లు వేస్తున్నాడు. అయితే ఇతడు చెడు స్నేహాల కారణంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో తన వ్యసనాలను తీర్చుకోడానికి నటుడిగా, కార్పెంటర్ గా సంపాదించిన కాస్త డబ్బును ఖర్చు చేశాడు. ఆ తర్వాత డబ్బులు లేక, వ్యసనాలను వదులుకోలేక దొంగగా మారాడు. చివరకు దొంగతనం కేసులో పోలీసులకు చిక్కి యాక్టర్ గా సంపాదించుకున్న మంచి పేరును పోగొట్టుకున్నాడు.

ఇతడి గురించి పోలసులు తెలియజేసిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 2016 నుండి దొంగతనాలు చేయడం ప్రారంభించిన నాగరాజు ఇప్పటి వరకు చైతన్యపురి పోలీస్టేషన్‌ పరిధిలో 16, సరూర్‌నగర్‌ పరిధిలో ఒకటి, మొత్తం17 ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డాడు. చైతన్య పురి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బైటపెట్టాడు. నాగరాజు వద్ద నుండి పోలీసులు రూ.22 లక్షల విలువ చేసే 72 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

click me!