నకిలీ 2 వేల నోటు తయారీ విధంబు ఎట్టిదనగా..

Published : Dec 22, 2016, 09:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
నకిలీ 2 వేల నోటు తయారీ విధంబు ఎట్టిదనగా..

సారాంశం

బెంగళూరు కుర్రాళ్లు జిరాక్స్ మిషన్ సహాయంతో నకిలీ రెండు వేల రూపాయిల నోటును తయారీ చేసి జైలుపాలయ్యారు.

 

బడా బాబుల ఇంటికి స్వయంగా ఆర్ బి ఐ నుంచే నికార్సైన రెండు వేల నోట్లు కట్టలు కట్టలుగా వెళుతున్నాయి.

 

ఇక యాక్సిస్ బ్యాంక్ అయితే నకిలీ నోట్లను డిపాజిట్ చేసుకోడానికి తెగ తొందరపడిపోతోంది.

 

సామాన్యుడు మాత్రం రూ.100 నోటు కూడా దొరక్క ఏటీఎంల ముందు, బ్యాంకు వద్ద క్యూలు కట్టి కూలబడిపోతున్నాడు.

 

 

ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలను మరీ ముఖ్యంగా మందుబాబుల బాధలను  చూసి చలించిపోయిన బెంగళూరుకు చెందిన శశాంక్‌, మధుకుమార్‌ అనే ఇద్దరు యువకులు

రెండు వేల నోటును ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన  విధానాన్ని కనిపెట్టారు.

 

 

కానీ, ఎటొచ్చి చివరకు పోలీసులకు దొరికిపోయారు. పాపం వాళ్లేమీ శేఖర్ రెడ్డి లాంటి నల్ల బాబులు కాదు కదా.. అందుకే వెంటనే జైళ్లో ఊసలు లెక్కబెడుతున్నారు.

 

 

ఇంతకీ వారు నకిలీ రూ. 2 వేల నోటును  ఎలా తయారు చేశారో తెలుసా..

 

 

ఒక కలర్ జిరాక్స్ మిషన్


కాస్త మందపాటి కాగితం

 

గ్రీన్ కలర్ మెరుపు పెన్ను

 

 

ముందుగా దళసరి కాగితాన్ని సరిగ్గా రూ.2వేల నోటు సైజులో కత్తిరించారు.

 

తర్వాత దాన్ని రూ. 2 వేల నోటుతో కలర్ జిరాక్స్ తీశారు.

 

చివరగా జిరాక్స్ తీసిన నోటుపై గ్రీన్ కలర్ మెరుపు పెన్నుతో రుద్దారు.

 

దీంతో రూ. 2 వేల నకిలీ నోటు రెడీ అయింది.

 

అలాంటివి ఒక 25 నోట్లు జిరాక్స్ తీసి బార్ల వెంట బారులు తీరి తమ దాహార్తిని తీర్చుకున్నారు.

 

కానీ, ఒక బార్ యజమానికి డౌట్ వచ్చి పోలీసులకు చెప్పడంతో నకిలీ కథ వెలుగుచూసింది. మనోళ్ల బతుకు చీకటైంది.

 

 

కొంపదీసి మీరు కూడా ఇలా తయారు చేసేరు... కచ్చితంగా జైళ్లో ఊసలు లెక్కబెట్టాల్సిందే.

 

అయితే వీళ్లు తయారు చేసిన నకిలీ నోటును చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

 

 

కొత్త నోటును పోలినట్లు వీరి నోట్లు  ఉన్నాయని, కాగితం నాణ్యతలో మాత్రమే తేడా ఉందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !