ఆ ఎమ్మెల్యేలు మరీ లావు

First Published Dec 22, 2016, 7:17 AM IST
Highlights

మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, అధికారులు బాగా లావెక్కారని  ముఖ్యమంత్రి ఫడ్నవీస్  జరిపించిన పరీక్షల్లో వెల్లడయింది.


 

 మహారాష్ట్ర ప్రభుత్వం బాగా బలుపెక్కినట్లు ఈ మధ్య వెల్లడయింది.

 

ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఆందోళన కలిగించేలావెక్కుతున్నారని ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ జరిపిన ఒక పరీక్షలో వెల్లడయింది.

 

 మొన్న నాగపూర్ అసెంబ్లీ సమావేశాలపుడు ఆయన ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు బరువు పరీక్షలు నిర్వహించి, షాక్ తిన్నారు.

 

మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు,  450  మంది ఉన్నతాధికారులకు పరీక్షల ను నిర్వహిస్తే, మొత్తం ప్రభుత్వం ఒబెసిటీతో మూలుగుతూ ఉందని తెలిసింది. 55 మంది ఎమ్మెల్యేలలో  53 మంది, అధికారులలో  170 మంది బాగా  కొవ్వుతో (ఒబెసిటి) బాధపడుతున్నట్లు వెల్లడయింది. మొత్తంతా 173  మంది ఒబెస్ క్యాటగిరి( బాడి మాస్ ఇండెక్స్ 30 కి పైగా) ఉంటేమిగతా వారు వోవర్ వెయిట్ ( బిఎంఐ 25-30) క్యాటగరిలో పడ్డారు.  

 

తర్వాత షుగర్ పరీక్షలో కోసం కేవలం 100 మందే ముందుకొచ్చారు. అందులో 22 మందికి  150 కంటే ఎక్కవగా షుగర్ వుందని ఈ పరీక్షలు జరిపిన పుణే బేరియాట్రిక్స్ సర్జన్ జయశ్రీ తోడ్కర్ చెప్పారు. వీరిలో 8 మందికి తమకు షుగర్ ఉందన్న విషయం కూడా తెలియదు.

 

 ఈ పరీక్ష చేయించాలనే అలోచన పడ్నవీస్ కు ఎందుకొచ్చిందో తెలుసా. ముఖ్యమంత్రి అయ్యాక బరువు పెరుగుతున్నట్లు అనుమానం వచ్చింది. వెంటనే డాక్టర్ జయశ్రీని సంప్రదిస్తే తగ్గాల్సిందే నని సలహా ఇచ్చారు. మూడు నెలలో ఆయన 18 కేజీలు తగ్గారట. ఇదే చికిత్స ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చేయించాల్సిందేనని ఆ తీర్మానించారు.

 

ఇదే  2017 కొత్త సంవత్సరం కొత్త లక్ష్యం  అని కూడా ఆయన ప్రకటించారు.  మూడు నెలల్లో బరువు తగ్గాల్సిందే నని ఆయన కచ్చితంగా చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

click me!