
ఇపుడుచంద్రబాబు మంత్రం అమరావతి కాదు, పోలవరం.
ఆయన ఎక్కడికి పోయినా పోలవరం గురించి చెప్పకుండా ముందుకు పోవడం లేదు. పోలవరం రివ్యూలు, పోలవరం సందర్శనలు,పోలవరం ఉపన్యాసాలు, పోలవరం పూజులు... రాజధాని ఇపుడు పోలవరంగా మారిపోయిందా అనిపిస్తుంది.
ఇంతగా ఆయన పోలవరం గురించి తపించేందుకు కారణం, పోలవరం వూరికే రాలేదు, దానికోసం ఆయన కేంద్రాన్ని బెదిరించాల్సి వచ్చింది. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం వెల్లడించారు.
పోలవరం ప్రాజక్టు నిర్మాణం మొదలయ్యేందుకు కారణం తెలంగాణాలో ఈ ప్రాజక్టు మీద అభ్యంతరం తొలగిపోవడమే. అభ్యంతరం ఎలా తొలగిపోయింది? ఖమ్మం జిల్లాలోని ఏడు మండాలాలను ఆంధ్రాకి మార్చడం వల్ల. అదెలా సాధ్యమయింది?
‘‘తెలంగాణలోని ఆ ఏడు మండలాలు ఆంధ్రాలో కలపకపోతే సీఎంగా ప్రమాణం చేయనని తెగేసి చెప్పా. దానితో మోదీ ప్రభుత్వం దిగివచ్చి తొలి కేబినెట్లోనే ఈ ముంపు మండలాలపై నిర్ణయం తీసుకోవాలసి వచ్చింది. ఆర్డినెన్స్ జారీ చేశారు,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఇంతముఖ్యమయింది కాబట్టే ఈ ప్రాజక్టు నిర్మాణాన్ని ప్రతిసోమవారం సమీక్షిస్తూన్నా’నని ఆయన అన్నారు.
‘2019 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది’ అని స్పష్టం చేశారు.
9నెలల్లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చంద్రబాబు చెప్పారు.
నేనింత కష్టపడుతుంటే వాళ్లేం (వైఎస్ ఆర్ ప్రభుత్వం) చేశారు. పోలవరం కాలువలు తవ్వి డబ్బులు దండుకున్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చాకున్నారు. అసలు వాళ్లకి సబ్జెక్టు తెలియదని, తెలుసుకోవాలంటే తరాలు పడుతుందని చంద్రబాబు అన్నారు.
రూ.1,638 కోట్లు ఖర్చుకానున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాలకు నీరందుతుంది.