యూఎస్ లో తెలుగు వాళ్ల జనాభా ఎంతో తెలుసా?

First Published Dec 26, 2017, 4:20 PM IST
Highlights
  • మన తెలుగు వాళ్లు ఎంత మంది ఉన్నారు..?
  • దీనిపై యూఎస్ సెన్సస్ బ్యూరో సర్వే చేపట్టింది.
  • ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి.

మన దేశం నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి వారిలో మన తెలుగు వాళ్లు ఎంత మంది ఉన్నారు..? ఎంత మంది తమిళం మాట్లాడేవాళ్లు ఉన్నారు..? దీనిపై యూఎస్ సెన్సస్ బ్యూరో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి.

 కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళం, పంజాబీ, బెంగాళీ భాషలు మాట్లాడుతున్నారో సర్వే చేశారు. కాగా.. భారత్ నుంచి అమెరికా వెళ్లిన వారిలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు.నిక్కీ హాలే( యూనైటెడ్ నేషన్స్ కి యూఎస్ అంబాసిడర్) తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులే. పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. అడోబ్ సీఈవో శాంతాను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల.. ఈ ఇద్దరూ హైదరాబాద్ కి చెందిన వారే కావడం గమనార్హం.( అక్కడ మాట్లాడే భాష తెలుగు) గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు కావడం విశేషం.

మనదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. సౌత్ ఇండియాలో తెలుగు, తమిళం ఎక్కువగా మాట్లాడేవాళ్లు ఉన్నారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా తమిళం మాట్లాడేవాళ్లు 70మిలియన్ల మంది ఉన్నారు. కేవలం అమెరికాలోనే 25లక్షల మంది తమిళం మాట్లాడేవాళ్లు ఉన్నట్లు తేలింది. అమెరికాలో ఇతన దేశీయులు మాట్లాడే భాషల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.3.17 మిలియన్ల మంది చైనీస్ భాష మాట్లాడుతున్నారు. కాగా రెండో స్థానంలో తగలాంగ్ భాష ఉంది. హిందీ మాట్లాడేవాళ్లు 0.74మిలియన్ల మంది ఉండగా..0.32 మిలియన్ల(3 లక్షల 20వేలు) మంది తెలుగు వాళ్లు ఉన్నారు.

తమిళం, తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువ మంది యూఎస్ లోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బెంగాళీ మాట్లాడేవాళ్లు కాలిఫోర్నియాలో, పంజాబీ మాట్లాడేవాళ్లు న్యూయార్క్ లో నివసిస్తున్నారు.

click me!