జుట్టు రాలిపోతోందా..అయితే ఉల్లిపాయ ట్రై చేయండి

First Published Dec 26, 2017, 3:31 PM IST
Highlights
  • జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘‘ ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు’’ అంటారు పెద్దలు. ఇప్పటి వరకు ఉల్లిపాయ ఆరోగ్యపరంగా మాత్రమే ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. కానీ.. కేవలం ఆరోగ్యమే కాదు.. ఉల్లిపాయతో అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మీరు చదివింది నిజమే.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలనే కోరుకుంటారు. కానీ.. ఎన్ని రకాల షాంపూలు, కండిషనర్లు వాడినా.. జుట్టు రాలే సమస్య మాత్రం తగ్గడం లేదు. అయితే.. అలాంటి వాళ్లు ఉల్లిపాయను ఉపయోగించి తమ జుట్టురాలే సమస్యను తగ్గించుకోవచ్చు... అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఒక ఉల్లిపాయ పొట్టును తొలగించాలి. తర్వాత.. ఆ ఉల్లిపాయను ముక్కలుగా తరిగి.. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ గుజ్జులో నుంచి రసాన్ని పిండుకోవాలి. ఆ రసాన్ని.. మీకు నచ్చిన నూనె( కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్) లో కలుపుకోవాలి. అనంతరం ఆ నూనెని కుదుళ్లకి బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఒక 30నిమిషాల పాటు  అలా వదిలేసి.. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.. జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

click me!