సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్ల పై హైకోర్టు కీలక తీర్పు

First Published Aug 24, 2017, 1:33 PM IST
Highlights

సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ద్వారానే మెడికల్ సీట్లు భర్తీ చేయాలని కోర్టు చెప్పింది

సూపర్ స్పెషాలిటీ యూనివర్సిటీ మెడికల్ సీట్ల పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కాళోజీ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో సూపర్ స్పెషాలిటీ సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరుతూ గతంలో హైకోర్టు లో పిటిషన్ వేశారు. పిటిషనర్ ల అభ్యర్థనను హైకోర్టు తోసి పుచ్చింది. సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా నే మెడికల్ సీట్లు భర్తీ చేయాలని కోర్టు చెప్పింది.రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు లో ఉండగా కాళోజీ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో సూపర్ స్పెషాలిటీ సీట్లను జాతీయ స్థాయి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు బి సతీష్ కుమార్ తో పాటు 12 పిటిషన్ లు వేశారు.ఆర్టికల్ 371 డి ప్రకారం కాళోజీ, సీట్లను 85 % తెలంగాణ అభ్యర్థులతో 15% సీట్లను ఆంద్రప్రదేశ్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాల 85%స్థానిక అభ్యర్థుల తో 15% తెలంగాణ అభ్యర్థులతో సీట్లను భర్తీ చేయాలని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు ను కోరారు.  హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు లో  సవాలు చేస్తామని పిటిషనర్లు తెలిపారు.

click me!