హేమమాలినికి తృటిలో తప్పిన ప్రమాదం

First Published May 14, 2018, 11:19 AM IST
Highlights

సినీ నటి, బిజెపి పార్లమెంటు సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. 

న్యూఢిల్లీ:  సినీ నటి, బిజెపి పార్లమెంటు సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో హేమమాలిన కాన్వాయ్ ముందు చెట్టు కూలి పడింది. మథుర సమీపంలోని మిథోలీ గ్రామంలోని ఓ బహిరంగ సభకు వెళ్లారు. ఈ సమయంలో ఆమె కాన్వాయ్ ముందు ఓ చెట్టు కూలి పడింది.

ఈదురుగాలులకు, పిడుగులకు దేశవ్యాప్తంగా ఆదివారంనాడు 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. 

అకస్మాత్తుగా ఆదివారంనాడు వాతావరణం మారిపోయి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఢిల్లీలో బీభత్సం సృష్టించింది. వచ్ేచ 48 నుంచి 72 గంటల వరకు కూడా పరిస్థితి ఇదే రకంగా ఉండవచ్చునని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. 

click me!