
గత రెండు రోజులుగా హైదరాబాద్ లో నిరంతర వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. నగరం అంతా పూర్తిగా నీటితో నిండి పోయింది. ప్రస్తుతం సాధారణ వర్షపాతంతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రెండు రోజుల వర్షాల కారణంగా కాలువలు, ట్రాఫిక్ జామ్లు, విద్యుత్ అంతరాయంతో ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అయితే ఉత్తర, పశ్చిమ, మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం నేటి ఉదయం 5:30 గంటలకు వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ నిపుణుల నాగరత్న వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఒడిస్సా, ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో వ్యాపించి ఉంది.ప్రధానంగా కోస్తా, తెలంగాణా జిల్లాలకు రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
సముద్ర తీరంలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున జాలర్లు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లకుడదని హెచ్చరిక జారీ చేసింది.
.
ఆంధ్రలో భారీ వర్షాలు కారణంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు
మచిలీపట్నం 08672-252572
విజయవాడ 0866-2474804