వర్షంలో చిక్కి ఉక్కిరిబిక్కిరయిన హైదరాబాద్

Published : Oct 02, 2017, 08:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
వర్షంలో చిక్కి ఉక్కిరిబిక్కిరయిన హైదరాబాద్

సారాంశం

నగరం లో 140 మాన్సూన్ అత్యవసర బృందా లు అప్రమత్తమయ్యా యి. 55 ప్రధాన కేంద్రాల్లో  ఎమర్జన్సీ బృందాలు  నిలిచిపోయిన నీటిని తొలగించే పనుల్లో వున్నాయి.

హైదరాబాద్  నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. నగరమంతా జలమయమయింది.రోడ్ల న్నీ వరదమయ్యాయి.  ఉరుములు.. మెరుపులతో ఒక్కసారి వర్షం నగరం మీద దాడి చేసింది. నాలుగున్నరనుంచి ఒకటే జడివాన. సుమారు మూడు నాలుగు గంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వానలో  హైదరాబాద్‌ను తడిసి ముద్దైంది. మెరుపు వానతో వర్షం వల్ల నగరం మంతా ట్రాఫిక్ భారీగా జామైంది. నగరంలోని నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్ల మీద కూడా మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల షో రూంలలోకి కూడా నీళ్లు ప్రవేశించాయి.

 

శెలవు కావడం వల్ల ట్రాఫిక్ కొద్దిసేపయిన తర్వాత కదలడం మొదలయింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు కూడా పడినట్లు తెలుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట(వీడియో), ఉప్పల్, మల్కాజ్‌గిరీ ఏరియాల్లో భారీ స్థాయిలో వర్షం నమోదు అయ్యింది.

 

మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరిచింది. నగరంలో ప్రజాజీవితాన్ని దారికి తెచ్చేందుకు అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశారు. జంట నగరాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని సూచనలిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా  విజ్ఞప్తి చేశారు అధికారులు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాతే ఉద్యోగస్తులు తమ కార్యాలయాల నుంచి తమ నివాసాలకు వెళ్లాలని సూచించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు చాలా జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు నగర పోలీసులు. ప్రజలు బయటకు రాకుండా.. ఇండ్లలోనే ఉండి నగర పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నగరం లో 140 మాన్సూన్ అత్యవసర బృంద లు అప్రమత్తమయ్యా యి. 55 ప్రధాన కేంద్రాల్లో  ఎమర్జన్సీ బృందాలు  నిలిచిపోయిన నీటిని తొలగించే పనుల్లో వున్నాయనిజి హెచ్ ఎం సి కమీషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన అత్యసర సమీక్ష నిర్వహించారు.

 

రాజీవ్ రహదారిపై భారీ కూడా వర్ష కురసింది. దసరా పండగ సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ - హైదరాబాద్ రహదారిపై భారీగా వాహనాల రాకపోకల ఈ వర్షం వల్ల స్తంభించిపోయాయి.

 

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజ్ఞాపూర్, తుర్కపల్లి, ములుగుతోపాటు మరి కొన్ని చోట్ల ట్రాఫిక్ జాం తీవ్రమయింది.

యాదగిరిగుట్టలో కుండపోతగా వర్షం కురియడంతో వరదనీరు భారీగా  ఆర్టీసీ బస్టాండ్లోకి ప్రవేశించింది. బస్టాండ్ చెరువయింది. ప్రయాణికుల ఇక్కట్లు అక్కడ వర్ణణాతీతం

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !