
హైదరాబాద్ క్రికెట్ పాలక మండలని రద్దు చెయాలని డిమాండ్ చేశారు మాజీ భారత కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్. లోథా కమీటి సూచనలు ప్రకారం హెచ్‌సీఎ ఎన్నికలు జరగలేదని ఆయన ఆరోపించారు. క్రికెట్ పాలక మండలిలో చట్టవ్యతిరేక పనులు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
సోమాజిగూడా ప్రెస్ క్లబ్ అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ హెచ్‌సీఎ పాలన పై తీవ్రంగా మండిపడ్డారు. భారత జట్టులో హైదారాబాద్ నుండి క్రీడాకారులు ఎంపిక అవ్వడం లేదని, అందుకు పాలక మండలి అనుసరిస్తున్న విధానాలని ఆయన పెర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను రంజీ జట్టుకు సెలక్ట్ చెయ్యకపోవడం పాలక మండలి పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు నష్టం జరుగుతోందని ఆవేధన వ్యక్తం చేశారు. కమీటి నిర్ణయాలు తనని తీవ్ర నిరాశకు గురిచేశాయని ఆయన ఈ సంధర్భంగా పెర్కొన్నారు.
హెచ్‌సీఎ పాలక మండలి లోథా కమీటి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తుందని, తక్షణమే ఆ కమీటిని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెటర్ల అభివృద్దికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
హెచ్‌సీఎ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.