ఖాదీ గబ్బర్ ... నువ్వు సూపర్

Published : Jan 17, 2017, 03:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఖాదీ గబ్బర్ ... నువ్వు సూపర్

సారాంశం

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా పవర్ స్టార్ నేతన్నకు అండగా ఉండేందుకే  ఈ నిర్ణయం

చేనేతకు చేయూత నిచ్చేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.  

 

మొన్న ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని కదిలించిన పవర్ స్టార్ ఇప్పుడు నేతన్నల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చారు.

 

తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక నేతలు, ఏపీ చేనేత కార్మికసంఘం సభ్యులు ఈ రోజు పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు పవన్‌కు వివరించారు.

వచ్చేనెల గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించారు.

 

అంతేకాకుండా చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని వారకి హామీ ఇచ్చారు.  

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !