కెసిఆర్ చేతిలో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా

Published : Sep 29, 2017, 09:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కెసిఆర్ చేతిలో గుత్తా సుఖేందర్  రెడ్డి రాజీనామా

సారాంశం

నల్గొండలో గెలిస్తే  రాష్ట్రంలో  ’బంగారు తెలంగాణ‘ నిర్మాణం సాగుతూ ఉందని, అది  ప్రజలకు కనబడుతూ ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్ కు పెట్టని కోటగా పేరున్న నల్గొండ జిల్తా ప్రజలకు బాగా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు.

 

నల్లొండ లోక్ సభ నియోజకవర్గానికి టిఆర్ ఎస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గురువారం నాడు ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అప్పగించారు.దసరా తర్వాత లేఖను  ముఖమంత్రి  లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపిస్తారు. పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు దీనిని ధృవీకరించాయి.

రాజీనామా వెనక ఉన్న ఉద్దేశాలు :

సుఖేందర్ రెడ్డి  2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్తిగా గెల్చి తర్వాత టిఆర్ ఎస్ లో చేరారు. అప్పటినుంచి ఆయన  కాంగ్రెస్కు  రాజీనాామా చేసి  మళ్లీ గెల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. కెసిఆర్ ఇలాంటి బెదిరింపుకులను పట్టించుకో లేదు. అయితే, ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీలు భూ సేకరణకు వ్యతిరేకంగా, నేరెళ్ల దళితుల మీద దాడిపైనా, ముందుకు సాగని ఉద్యోగ నియామకాలు వంటివాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి, టిడిపి,వామపక్షాలతో పాటు  జెఎసి జండా పట్టుకుని ప్రొఫెసర్ కోదండ్ రామ్ కూడి టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా యాత్రలు, పోరాటం  మొదలుపెట్టారు. సింగరేణి ఎన్నికలలో ఆయన మొదటి సారి టిఆర్ ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దీనితో తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకత (యాంటిఇంకంబెన్సీ) పెరుగుతూ ఉందని టాక్ మొదలయింది. ఇది తప్పని నిరూపించాలి. దీనికి కెసిఆర్ నల్గొండ అనువయినదిగా ఎంచుకున్నారు. ఎందుకంటే, ఇక్కడ గెలిస్తే ఫిరాయింపులు ప్రోత్సహించారనే మచ్చ పోతుంది. దానికి తోడు మూడేళ్లుగా  పరిపాలించినా  ప్రభుత్వ వ్యతిరేకత  లేదని చెప్పవచ్చు. ఎంపి గెలిపించుకుంటే ఎన్డీయే ప్రభుత్వం దగ్గిర పలుకుబడి పెరుగుతుంది. ప్రతిపక్షాల ప్రచారం , ఉద్యమాలు తప్పని కూడా దబాయించవచ్చు. అన్నింటికంటే, బంగారు తెలంగాణా నిర్మాణం సాగుతూ ఉందని, అది  ప్రజలకు కనబడుతూ ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్ కు పెట్టని కోటగా పేరున్న నల్గొండ జిల్తా ప్రజలకు బాగా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు.

నల్గొండ ఉప ఎన్నికలో టిఆర్ ఎస్  అఖండవిజయం సాధించి, ఒక వేళ కాంగ్రెస్ ధరావత్తు కోల్పోతే, మొత్తం ప్రతిపక్ష పార్టీల ఆత్మ స్థయిర్యం దెబ్బతీయవచ్చు. 2019 ఎన్నికలలో ఈ పార్టీల తరఫున పనిచేసేందుకు కార్యకర్తలే దొరక్కుండా చేయవచ్చు.

అందువల్ల ముఖ్యమంత్రి చాలా పకడ్బందీ గుత్తాకు క్యాబినెట్ ర్యాంకు తో రైతు సమితి కట్టబెట్టి ఫిరాయింపు దారునిగా  ఎన్నికల్లో లేకుండా చేస్తున్నాడు. కొత్త క్యాండిడేట్ను ఎంపిక చేసి గెలిపించేందుకు వ్యూహం సిద్ధమవుతూ ఉందని చెబుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !