తిరుమలలో తుపాకీ క‌ల‌క‌లం

Published : Aug 09, 2017, 01:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తిరుమలలో తుపాకీ క‌ల‌క‌లం

సారాంశం

తిరుమలలో తుపాకీ కలకలం. ఈ నెలలో ఇది మూడవ సారి. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది.

తిరుమ‌ల అలిపిరి వ‌ద్ద‌ రీవాల్వాల్ క‌ల‌క‌లం రేపింది. ద‌ర్శ‌నానికి వాహానాల ద్వారా చేరుకునే భ‌క్తుల చెక్ పాయింట్ అలిపిరి వద్ద‌ రివాల్వర్ కనుగొన్నారు. చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల‌కు మహారాష్ట్ర కు చెందిన‌ భక్తుడు తుపాకీతో పట్టుబట్టాడు. ఆ రివాల్వర్ లోడ్ చేసి ఉండ‌టం ఆ వ్యక్తిని త‌క్ష‌ణ‌మే ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుప‌తి పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించి అ వ్య‌క్తిని విచారిస్తున్నారు. ఈ నెల‌లోనే ఇలా జ‌ర‌గ‌టం మూడ‌వ సారి, త‌గంలో రెండు సార్లు రీవాల్వార్ తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

మరో సంఘటనలో భారీగా గంజాయి పట్టుబడింది.11 గంట‌ల స‌మ‌యంలో తిరుపతి రైల్వేస్టేషన్‌లో గంజాయి  దొరికింది. సాధార‌ణంగా రైల్వేస్టేషన్‌లో రైల్వే, ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు చేపట్టగా 24 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరొ ఇద్ద‌రు పరారయ్యారు. ఆ వ్య‌క్తిని విచారిస్తే విజ‌యవాడ నుండి చైన్నైకి త‌ర‌లిస్తున్న‌ట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్య‌క్తిని మ‌రింత విచారించి వివరాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

తిరుమ‌ల‌కు రోజుకు వేలాది మంది భ‌క్తులు వివిధ మార్గాల ద్వారా వ‌స్తుంటారు. అంద‌రి మీదా పోలీసులు నిఘా పెట్ట‌లేరు, దొరికిన వారు కొంద‌రు దొర‌క‌ని వారు ఎంద‌రొ..! 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu