గుజరాత్ లగడపాటి సర్వే నిజమవుతున్నదా?

First Published Dec 18, 2017, 3:27 PM IST
Highlights

కాంగ్రెస్ ఓడినా బిజెపి వెనకాలే ఉంటుంది

గుజరాత్‌  లగడపాటి సర్వే నిజమయింది. ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీకి భారీ విజయం సూచించాయి. కాంగ్రెస్ కు అరవై సీట్ల కు మించి రావని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆ తర్వాత ఇరవై నాలుగ్గంటలకు బిజెపి రాజ్యసభ సభ్యుడ సంజయ్ కాకడే తన సర్వే ఫలితాలు ప్రకటించి అందరిని విస్మయపరిచారు. బిజెపి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అయితే, అందరిని ఆలోచింపచేశారు. గుజరాత్ లో బిజెపి గెలవడం కష్టమని చెప్పారు. ఏకారణం చేతనయినా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటుచేస్తే, కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగానే ఉంటుందని చెప్పాడు.  అంటే బిజెపికి అఖండ విజయం రాదని, కాంగ్రెస్ తీరుకూడా బాగానే ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో బిజెపి వ్యతిరేకత ఉందని అన్నారు. ఒక వేళ గెలిస్తే అదంతా ప్రధాని మోదీ చలవే అన్నారు. విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ లాగే సంజయ్ కూడా తనదయిన పద్ధతిలో సొంతంగా సర్వేలుచేయిస్తూ ఉంటాడట. మిడియా సృష్టిస్తున్న  బిజెపి హవాను ఆయన శంకించినట్లున్నారు. తన టీమ్ ను రంగంలోకి దించి సర్వే చేయించారు.

ఫలితాల ట్రెండ్ చూస్తే గుజరాత్ లగడపాటి సర్వే యే నిజమవున్నది. మహా మహా చానెల్స్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గాలికి కొట్టుకు పోయాయి. ఈ  ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా భారతీయ జనతా పార్టీకి 110 నుంచి 120 స్థానాల వరకూ వస్తాయని చెప్పాయి. కాంగ్రెస్‌ 60 స్థానాల దగ్గిరే కూలబడిపోతుందని చెప్పాయి.అయితే గుజరాత్‌లో ఫలితాల స‌ర‌ళి దీనికి భిన్నంగా ఉంది. బిజెపి, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ సాగింది.  భాజపా ముందంజలో ఉన్నప్పటికీ రెండు పార్టీలు మధ్య అంతరం స్వల్పంగానే ఉంటున్నది.భాజపా ఆధిక్యం వంద స్థానాలను దాటుతున్నా  కాంగ్రెస్‌ సీట్లు కూడా సమీపంలోనే ఉంటున్నాయి. ఈ వార్త రాస్తున్నప్పటికి కాంగ్రెస్‌ 81 స్థానాల్లో ముందంజలో ఉంది. బిజెపి మాత్రం 99 దగ్గిర స్థిరపడింది.

 

click me!