గోవులకు ఆధార్ కార్డు కోసం ఉద్యమం

First Published Apr 24, 2017, 7:14 AM IST
Highlights

మనుషులకు ఆధార్ కార్డు, రేషన్ డిపోలు న్నట్లే,  అవులకు కూడా ఆధార్ కార్డుండాలే. రేషన్ షాపుల్లాగా ప్రతి వూర్లో గడ్డి డిపోలండాలే

ఆ మధ్య కేరళలో ఒక జోక్ ప్రచారం లోకి వచ్చింది. కొంతమంది ఏకంగా గోవుపేరుతో చక్కటి అధార్ కార్డు తయారుచేసి సోషల్  మీడియాలో వదిలారు. అది అందరి దృష్టి అకట్టుకుంది.  నిజమే అనుకునేలోపే ఇపుడు గోమాతకు అధార్ కార్డు ఎందుకివ్వరి ఉద్యమం మొదలవుతూ ఉంది. అధికూడా గజరాత్ నుంచే.

 

ఇది నిజమయ్యేటట్టుంది. కేంద్రం కూడా గోధార్  (గోవు ప్లస్ అధార్ ) గురించి యోచిస్తున్నట్లు వార్త లొస్తున్నాయి.  ఇలాంటపుడే గుజరాత్  ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

 

నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటినుంచి గోవుల మీద ప్రత్యేక శ్రద్ద మొదలయిన సంగతి తెలిసిందే.

 

ఇపుడు  ప్రధాని సొంత రాష్ట్రం నుంచి గోవుల సంక్షేమం కోసం కొత్త నినాదం మొదలయింది.  అక్కడి గో ప్రేమికులు గోవులన్నింటికి ఆధార్ కార్డు ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు.  ఈ డిమాండ్ ప్రజలను కూడా సమీకరించబోతున్నారు.

 

సురేంద్ర నగర్ కు చెందిన  ద‌ళిత నాయకుడు నాథూ పర్మార్ దేశంలోని గోవులన్నింటికి ఆధార్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.  ప్ర‌తి గోవుకు ఆధార్ త‌ర‌హాలో నంబ‌రు కేటాయించడమే కాదు, వాటి కోసం ప్రతి వూర్లో ఒక పశుగ్రాసం డిపో కూడా ఏర్పాటుచేయాలనేది ఆయన డిమాండ్.

 

 స‌రైన మేత లేక రోడ్డు ప‌క్క‌న ప‌డిఉన్న‌ ప్లాస్టిక్ బ్యాగుల‌ను తింటూ అనారోగ్యానికి గురై  గోవులు మృతి చెందుతున్నాయ‌న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ  గోవులకు పరిశుభ్రమయిన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన చెబుతున్నారు. ఈ డిమాండ్ ను హైలైట్ చేసేందుకు మే 10 వ తేదీన (భూత దయ) ఒక సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

‘మనుషులకు ఆదార్ కార్డు, రేషన్ డిపోలు న్నట్లే,  అవులకు కూడా ఆధార్ కార్డుండాలే. రేషన్ షాపుల్లాగా ప్రతి వూర్లో గడ్డి డిపోలండాలే.’  అని ఆయన అన్నారు.

 

అంతేకాదు, చనిపోయిన గోవులను చూపి దళితుల మీద దాడులు చేస్తున్నందున చనిపోయిన ప్రతి ఆవును పోస్టు మార్టం చేసి చావు కారణాన్ని ప్రకటించాలని కూడా పర్మార్ అన్నారు.

 

 

 

 

click me!